Home> వినోదం
Advertisement

Rishab shetty Kantara : ఆస్కార్ రేసులోకి కాంతారా.. ఏ ఏ కేటగిరిల్లో పోటీ పడుతోందంటే?

Kantara in Oscars 95 Nominations 95వ ఆస్కార్ అవార్డుల రేసులో కాంతారా కూడా నిల్చుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడి కేటగిరిలో కాంతారా సినిమాను నామినేషన్ లిస్ట్‌లోకి అకాడమీ అవార్డు సంస్థ ఎక్కించుకుందట.

Rishab shetty Kantara : ఆస్కార్ రేసులోకి కాంతారా.. ఏ ఏ కేటగిరిల్లో పోటీ పడుతోందంటే?

Kantara in Oscars 95 Nominations కాంతారా సినిమా దేశంలో ఓ పెను సంచలనం సృష్టించింది. రిషభ్ శెట్టి నటించి, తెరకెక్కించిన కాంతారా సినిమా కన్నడలో రికార్డులు క్రియేట్ చేసింది. కన్నడలో హిట్ అయిన తరువాత దేశ వ్యాప్తంగా డబ్ అయింది. హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. అలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా నాలుగు వందల కోట్లు కొల్లగొట్టేసిందని టాక్. అలాంటి సినిమా ఇప్పుడు ఆస్కార్ సభ్యుల దృష్టికి వెళ్లింది.

కాంతారాను నిర్మించిన హోంబలే సంస్థ.. ఆస్కార్‌ రేసులో ఈ సినిమాను నిలబెట్టేయాలని ప్రయత్నిచింది. వారి ప్రయత్నాలు ఇప్పుడు సఫలమైనట్టు కనిపిస్తోంది. 95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్‌, క్వాలిఫికేషన్ లిస్ట్‌లోకి కాంతారా సినిమా వెళ్లింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో కాంతారా సినిమాను ఎంపిక చేసుకున్నారు. మరి చివరి వరకు రేసులో నిలబడి అంతర్జాతీయ చిత్రాలు, నటులతో కాంతారా గెలిచి నిలబడుతుందా? లేదా? అన్నది చూడాలి.

 

ఇప్పటికే ఇండియా నుంచి చెల్లో షో, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు ఆస్కార్ రేసులో ఉన్నాయి. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కాంతారా సినిమా సైతం రేసులోకి వచ్చింది. దీంట్లో మన సినిమాలు అవార్డులు అందుకుంటే మాత్రం అది ఓ హిస్టరీగానే నిలిచిపోతుంది. మరి ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో అద్భుతం జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి.

ఇప్పుడు లాస్ ఏంజిల్స్‌లో రాజమౌళి, ఎన్టీఆర్ చేస్తోన్న సందడి అందరికీ తెలిసిందే. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఉత్తమ దర్శకుడు అవార్డును రాజమౌళి సొంతం చేసుకున్న విషయం విదితమే.

Also Read: Keerthy Suresh Bikini : బికినీలో కీర్తి సురేష్‌.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించే పిక్స్

Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More