Home> వినోదం
Advertisement

Shyam Singha Roy Songs: రాయల్ లుక్ లో హీరో నాని.. శ్యామ్ సింగరాయ్ లిరికల్ సాంగ్ రిలీజ్

Shyam Singha Roy Songs: నేచురల్ స్టార్ నాని హీరోగా.. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలు. తాజాగా ఈ మూవీలోని 'రైజ్​​ ఆఫ్ శ్యామ్'​ పాట తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో బెంగాలీ నటుడు జిషూ సేన్​ గుప్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Shyam Singha Roy Songs: రాయల్ లుక్ లో హీరో నాని.. శ్యామ్ సింగరాయ్ లిరికల్ సాంగ్ రిలీజ్

Shyam Singha Roy Songs: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి హీరోయిన్స్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుందీ చిత్రం.   

ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ వేగవంతం చేశారు. ఈ సందర్భంగా.. ఈ మూవీ నుంచి రైజ్ ఆఫ్ శ్యామ్ ఫుల్ లిరికల్ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ‘శ్యామ్ సింగరాయ్..’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా… ఈపాటలోని నాని పూర్తిగా మాస్ లుక్లో అదరగొడుతున్నాడు. ఈ పాటను మిక్కి జే మేయర్ కంపోజ్ చేశారు. ఇక ఇందులో నాని ప్లాష్ బ్యాక్లో పవర్ ఫుల్ లీడర్గా కనిపిస్తుండగా.. ఆ తర్వాత మాస్ లుక్లో కనిపిస్తున్నాడు. 

Also Read: Chiranjeevi 154 Movie Poster: మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే!

Also Read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్ కేసు విచారణ నుంచి వాంఖడేను తొలగించిన ఎన్సీబీ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More