Home> వినోదం
Advertisement

వర్మ తీసిన "జీఎస్‌టీ" ఖరీదు.. రూ.150 మాత్రమే..!

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా అనుభవాలతో కూడిన "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే చిత్రాన్ని ఇటీవలే తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

వర్మ తీసిన

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా అనుభవాలతో కూడిన "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే చిత్రాన్ని ఇటీవలే తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే రోజున ఈ చిత్రాన్ని ఆన్‌లై‌న్ ద్వారా రిలీజ్ చేస్తానని వర్మ ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఇంతలోనే ఆయన పేల్చాల్సిన బాంబు పేల్చాడు. ఈ చిత్రాన్ని ఉచితంగా చూపించడట.  ఆన్‌లైన్‌లో డబ్బులు కట్టిమాత్రమే ఈ చిత్రాన్ని చూడచ్చని ఆయన తెలిపారు. మన దేశంతో పాటు ఇతర దేశస్థులు కూడా ఈ చిత్రాన్ని చూడాలంటే అక్కడి మార్కెట్ ప్రకారం ఆన్‌లై‌న్ ద్వారా డబ్బు చెల్లించి ఈ చిత్రం చూడాల్సిందే. ఇండియన్ కరెన్సీలో రూ.150 చెల్లించి ఈ చిత్రాన్ని చూడవచ్చని ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రొడక్షన్ సంస్థ తెలిపింది. అదే శ్రీలంక, పాకిస్తాన్‌లో అయితే రూ.200 ఛార్జి చేస్తున్నారు. అమెరికాలో మాత్రం 2.99 డాలర్లు, యూరప్‌లో అయితే 1.99 యూరోలను ఈ చిత్రాన్ని చూడడానికి వసూలు చేసే రుసుముగా ప్రొడక్షన్ సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో డిజిటల్ మీడియా ద్వారా ఆర్జీవీ విడుదల చేసే వెబ్ సిరీస్‌కు, షార్ట్ ఫిలిమ్స్‌కు కూడా ఆయన ఇలాగే ఛార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Read More