Home> వినోదం
Advertisement

Anusha Shetty: ఎన్టీఆర్ తల్లికి, నాగశౌర్య కాబోయే భార్య అనూషకు రిలేషన్ ఏంటో తెలుసా?

Nagashaurya Fiance Anusha Shetty : ఎన్టీఆర్ తల్లికి నాగశౌర్య కాబోయే భార్య అనూష శెట్టికి ఒక రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

 Anusha Shetty: ఎన్టీఆర్ తల్లికి, నాగశౌర్య కాబోయే భార్య అనూషకు రిలేషన్ ఏంటో తెలుసా?

Relation Between Nagashaurya Fiance Anusha Shetty and NTR Mother Shalini: టాలీవుడ్ బ్యాచిలర్ హీరోల జాబితా నుంచి నాగశౌర్య తప్పుకుంటున్నారు. ఈనెల 20వ తేదీన నాగశౌర్య బెంగళూరు లో ఇంటీరియర్ డిజైనర్గా వ్యవహరిస్తున్న అనూష శెట్టి అనే యువతిని పెళ్లాడబోతున్నాడు. వీరిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచిన ఈ జంట ఎట్టకేలకు రెండు కుటుంబాలు పెద్దలను ఒప్పించి వివాహ బంధంతో ఒకటవ బోతున్నారు.

ఈనెల 20వ తేదీన బెంగళూరులోని ఒక స్టార్ హోటల్లో వీరి వివాహం జరగబోతుండగా 19వ తేదీన మెహందీ వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. ఒకరకంగా కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి టాలీవుడ్ సెలబ్రిటీ పెళ్లి కావడంతో ఎంత గ్రాండ్ గా చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే నాగశౌర్య కాబోయే భార్య ఎన్టీఆర్ తల్లికి ఒక రిలేషన్ ఉందనే విషయం తాజాగా వెల్లడైంది. అయితే అది బంధుత్వం కాదు కానీ ఒక రిలేషన్ అయితే ఉంది.

అసలు విషయం ఏమిటంటే కర్ణాటకలోని మంగళూరు తాలూకా కుందాపూర్ అనే గ్రామంలో ఎన్టీఆర్ తల్లి జన్మించింది. అదే ఊరిలోనే ఇప్పుడు ఈ అనూష శెట్టి కూడా జన్మించింది. అయితే తండ్రి వ్యాపార రీత్యా అనూష కుటుంబం బెంగళూరులోనే స్థిరపడింది. అయితే ఎన్టీఆర్ తల్లిది అనూష శెట్టిది ఒకే ఊరు అన్నమాట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇటీవల కాంతార  సినిమాతో సూపర్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన రిషబ్ శెట్టిది కూడా అదే ఊరు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాగశౌర్య సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే నాగశౌర్య తాను ఎన్టీఆర్ కి వీరాభిమాని అని అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తల్లి పుట్టిన ఊరిలోనే పుట్టిన అమ్మాయిని చేసుకోవడం ఇప్పుడు నాగశౌర్య అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బెంగళూరులోని జెడబ్ల్యూ మారియట్లో ఈనెల 20వ తేదీన ఉదయం 11:25 నిమిషాలకు వీరి వివాహం జరగబోతోంది.

Also Read: Allu Arjun Fans Blunder : పప్పులో కాలేసిన అల్లు అర్జున్ ఫాన్స్.. ఆ లాజిక్ ఎలా మిస్సయ్యారు భయ్యా?

Also Read: Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు షాకింగ్ న్యూస్..ఆ సినిమాలు ఇక లేనట్టే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More