Home> వినోదం
Advertisement

Raviteja Birthday: మాస్ సామ్రాజ్యానికి మకుటం లేని రారాజు మన రవితేజ!

Raviteja Birthday: సినీ ఇండస్ట్రీలో ఒక హీరోకు మాస్ ఇమేజ్ రావాలంటే అది సాధారణ విషయం కాదు. వందలో ఒకరు లేదా ఇద్దరు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలా ఆకట్టుకున్న హీరోల సినిమాలకు.. మాస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అయితే టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలో మొదలైన రవితేజ.. ఇప్పుడు మాస్ సామ్రాజ్యానికే మహరాజ్ గా ఎదిగాడు. నేడు (జనవరి 26) ఆయన పుట్టినరోజు సందర్భంగా రవితేజ సినీ కెరీర్ లోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం. 
 

Raviteja Birthday: మాస్ సామ్రాజ్యానికి మకుటం లేని రారాజు మన రవితేజ!

Raviteja Birthday: సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రల్లో మెరిసి సహాయ దర్శకుడిగా తెరవెనుక పనిచేశాడు రవితేజ. ఆ తర్వాత వెండితెరపై హీరోగా తళుక్కుమని.. తన హవా ఇప్పటికీ కొనసాగిస్తూ ఎందరో అభిమానుల్ని పొందాడు. నేడు (జనవరి 26) ఆయన పుట్టినరోజు సందర్భంగా రవితేజ గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. 

రవితేజ బాల్యం 

రవితేజ అసలు పేరు రవి శంకర్ రాజు భూపతిరాజు. 1968 జనవరి 26న ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో జన్మించాడు. తండ్రి రాజ్ గోపాల్ రాజు ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. తల్లి రాజ్యలక్ష్మి భూపతిరాజు. వీరి ముగ్గురు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. రవితేజ తండ్రి ఉద్యోగ రీత్యా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు మారాల్సి వచ్చింది. దీంతో తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా రవితేజకు పట్టుంది. జైపూర్, ఢిల్లీ, ముంబయి, భోపాల్ తర్వాత వీరి కుటుంబం విజయవాడలో సెటిల్ అయ్యింది. నటనపై మక్కువతో 1988లో రవితేజ మద్రాసు వెళ్లాడు. 

సినీ పరిశ్రమలో తొలినాళ్లు

సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లిన రవితేజ.. ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. అదే గదిలో ప్రముఖ దర్శకులు వైవీఎస్ చౌదరి, గుణశేఖర్ ఉండేవారు. 'కర్తవ్యం', 'చైతన్య', 'ఆజ్‌ కా గూండా రాజ్‌' ('గ్యాంగ్‌ లీడర్‌' హిందీ రీమేక్‌)లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు రవితేజ. ఒక పక్క నటిస్తూనే మరో పక్క సహాయ దర్శకుడిగా, బుల్లితెరకూ పని చేసేవాడు. సహాయ దర్శకుడిగా బాలీవుడ్, టాలీవుడ్​లో ఎన్నో ప్రాజెక్టులకు వర్క్‌ చేశాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'నిన్నే పెళ్లాడతా' సినిమాకూ సహాయ దర్శకుడిగా చేస్తూనే.. ఓ పాత్రలో నటించారు. 

హీరోగా తొలి అవకాశం

1997లో తొలిసారి ఓ లీడ్ క్యారెక్టర్ చేసే అవకాశం 'సింధూరం' సినిమా ద్వారా వచ్చింది. ఆ తర్వాత అనేక సైడ్ పాత్రల్లోనూ నటించాడు రవితేజ. 1999లో రవితేజ ప్రధాన పాత్రలో శ్రీను వైట్ల దర్శకత్వంలో 'నీ కోసం' సినిమా రూపుదిద్దుకొంది. ఆ తర్వాత 'సముద్రం', 'అన్నయ్య', 'బడ్జెట్‌ పద్మనాభం', 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'సకుటుంబ సపరివారసమేతం', 'అమ్మాయి కోసం' వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 

కమర్షియల్ హీరోగా..

దర్శకుడు పూరీ జగన్నాథ్ తో రవితేజ హీరోగా చేసిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో రవితేజ కమర్షియల్ హీరోగా అవతరించాడు. అప్పటి నుంచి రవితేజ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' విమర్శకులను మెప్పించింది. ఆ తర్వాత 'ఇడియట్' సినిమాతో రవితేజ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. వీటి తర్వాత 'ఖడ్గం', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి', 'వెంకీ' సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. 

బాక్సాఫీసు 'విక్రమార్కుడు'

రవితేజ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో 2006లో విడుదలైన 'విక్రమార్కుడు'.. ఆయన నటించిన సినిమాల్లో కెల్లా ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. ఆ తర్వాత వచ్చిన 'ఖతర్నాక్' సినిమా మెప్పించలేకపోయింది. 2007లో 'దుబాయ్ శీను', 2008లో 'కృష్ణ' కామెడీ టచ్ తో ప్రేక్షకులను నవ్వించాడు రవితేజ. 

ఆ తర్వాత 'నేనింతే', 'కిక్', 'ఆంజనేయులు', 'శంభో శివ శంభో', 'డాన్ శీను' సినిమాలతో ఫర్వాలేదనిపించాడు రవితేజ. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా 2011లో విడుదలైన చిత్రం 'మిరపకాయ్‌'. ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో పాటు 'దొంగల ముఠా', 'వీర', 'నిప్పు', 'దేవుడు చేసిన మనుషులు', 'సారొచ్చారు' సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. ఆ వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' సినిమాతో మరోసారి సక్సెస్ ను అందుకున్నారు రవితేజ. అనంతరం 'పవర్', 'కిక్ 2', 'బెంగాల్ టైగర్' వంటి చిత్రాలతో అలరించారు. 

ఓ ఏడాది విరామం తర్వాత 'టచ్ చేసి చూడు', 'రాజా ది గ్రేట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'డిస్కోరాజా' సినిమాల్లో మెప్పించారు. ఇటీవలే కరోనా మొదటి వేవ్ తర్వాత 'క్రాక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మాస్ మహరాజ్ పవరేంటో నిరూపించాడు. ఇప్పుడు ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

పురస్కారాలు

'నీ కోసం', 'ఖడ్గం' సినిమాలకు నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నారు రవితేజ. 'నేనింతే' చిత్రంలోని పాత్రకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని దక్కించుకున్నారు.  

Also Read: Neha Sharma Bikini Photos: టూ పీస్ బికినీలో రచ్చ చేస్తున్న రామ్ చరణ్ హీరోయిన్!

Also Read: Ashu Reddy Dubai Visit: అషు రెడ్డి వెనకున్న ఆ బాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More