Home> వినోదం
Advertisement

Ravanasura Twitter Review: రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ ఇలాంటివి చేయకు అన్న!

Ravanasura Movie Twitter Review: మాస్ మహారాజా రవితేజ హీరోగా రావణాసుర అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. అయితే హీరోలనే వారు ఉండరు అంటూ క్యాప్షన్ పెట్టి.. రవితేజ లాంటి హీరోతో సినిమాను తీశాడు సుధీర్ వర్మ. దీంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి..

Ravanasura Twitter Review: రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ ఇలాంటివి చేయకు అన్న!

Ravi Teja's 'Ravanasura' Movie Twitter Review: మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు ఫుల్ ఫాంలోకి వచ్చాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద డబుల్ బ్లాక్ బస్టర్‌ హిట్లుగా నిలిచాయి. దీంతో రావణాసుర సినిమా మీద కూడా మంచి హైప్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా మీద నెటిజన్లు ఏమంటున్నారు.. ట్విట్టర్ టాక్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

అన్నా మళ్లీ ఇలాంటి సినిమా చేయకు.. నిప్పు, ఖిలాడీ సినిమాలానే అనిపిస్తోంది.. ఖిలాడీ కాస్త బెటర్ అన్నా.. నీకు ఫెయిల్యూర్ సినిమాలు రావొద్దని అనుకుంటాం.. కానీ నువ్ డిజాస్టర్ తీస్తావ్ అని ఓ అభిమాని ఆవేదన చెందాడు. సినిమా అదిరిపోయిందని ఓ అభిమాని కామెంట్ చేశాడు.. విలన్‌ రోల్‌లో అదరగొట్టేశాడని, వన్ మెన్ షో అని అంటున్నారు.

ఇక ఇందులో తెలంగాణ స్లాంగ్ వింటే చెవుల్లోంచి రక్తాలు వస్తున్నాయ్.. అసలు తెలుగు సినిమాలో ఇలా యాసను వాడటం బ్యాన్ చేయాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. క్రైమ్ సీక్వెన్స్‌లు బాగానే వచ్చాయని, ఇంటర్వెల్ సీన్ అద్భుతంగా ఉందని, పూర్తి కొత్త పాత్రలో రవితేజ కనిపిస్తాడని, అద్భుతంగా నటించాడని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

కొందరేమో ఈ సినిమా కామెడీ, సాంగ్స్ ఇవన్నీ అడ్డం పడ్డాయ్ అని అంటుంటే.. ఆ కామెడీయే, పాటలే కలిసి వచ్చాయని కమర్షియల్ మూవీ లవర్స్ అంటున్నారు. ఇలా రావణాసుర సినిమా మీద ట్విట్టర్‌లో అయితే మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. మరి ఇది రవితేజకు హ్యాట్రిక్ హిట్ అవుతుందా? సుధీర్ వర్మకు మళ్లీ హిట్ పడుతుందా? సుశాంత్ పాత్రకు ఏమైనా మార్కులు పడి ఎలివేట్ అవుతాడా? అన్నది చూడాలి.

అను ఇమాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడా, మేఘా ఆకాశ్‌, దక్షా నగార్కర్ వంటి హీరోయిన్లు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. మరి ఈ ఐదుగురిలో ఏ హీరోయిన్‌కు ఎక్కువ మార్కులు పడతాయో చూడాలి.

Also Read:  Padma Awards 2023 : గర్వంగా ఉంది పెద్దన్న.. కీరవాణిపై రాజమౌళి ట్వీట్

Also Read: Samantha Ruth Prabhu : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అతడికి ఐలవ్యూ చెప్పిన సమంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More