Home> వినోదం
Advertisement

This Week Theatre & OTT Release: రవితేజతో కిరణ్ అబ్బవరం పోటీ.. ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!

This Week Theatre & OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లో పలు సినిమాలు సందడి చేయబోతోన్నాయి. అయితే ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాల సందడి ఏమీ కనిపించడం లేదు. థియేటర్లో మాత్రం పెద్ద హీరో, చిన్న హీరో పోటీ పడబోతోన్నారు.

This Week Theatre & OTT Release: రవితేజతో కిరణ్ అబ్బవరం పోటీ.. ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!

This Week End Theatre & OTT Movies: ప్రతీ వారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మామూలుగా అయితే శుక్రవారం నాడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ మధ్య బుధవారం, గురువారం కూడా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని అనుకుంటున్నారు. ఈ వారం థియేటర్లో, ఓటీటీలోనూ కొన్ని సినిమాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. అయితే థియేటర్లో వచ్చేందుకు రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి.

రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. ధమాకా వంద కోట్ల కొల్లగొట్టడం, ఆ తరువాత వాల్తేరు వీరయ్య డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో రవితేజ మార్కెట్ మరింతగా పెరిగింది. ఇప్పుడు రావణాసుర అనే సినిమాతో రవితేజ రెడీగా ఉన్నాడు. సుధీర్ వర్మ స్టైలీష్ మేకింగ్‌ పట్ల అందరికీ ఓ మోస్తరు అంచనాలుంటాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్ దుమ్ములేపేశాయి. ఐదుగురు హీరోయిన్లు, సుశాంత్ ఇలా ఎన్నెన్నో స్పెషల్ అట్రాక్షన్‌లున్న ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్లోకి రాబోతోంది.

కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా వచ్చాడు. ఈ సినిమా చివరకు బ్రేక్ ఈవెన్ అయి కాస్త లాభాలను కూడా తెచ్చి పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త సినిమాతో రెడీ అయ్యాడు. మరోసారి మాస్ కమర్షియల్ ఫార్మూలానే నమ్ముకుని మీటర్ అనే సినిమాతో ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.

ఇక ఇవి కాకుండా ఇంకొన్ని చిన్న సినిమాలున్నట్టుగా కనిపిస్తున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం అన్నీ హాలీవుడ్, హిందీ సినిమాలే వస్తున్నాయి. తెలుగు సినిమాల సందడి ఈ వారం ఓటీటీలో కనిపించడం లేదు.  బీఫ్, చుపా, హంగర్ వంటి సినిమాలు నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోన్నాయి. బ్యాట్ మాన్, కాస్మోస్ అనే సినిమాలు బుక్ మై షోలో వస్తున్నాయి. ది క్రాసోవర్, రొమాంచర్ అనేవి డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోన్నాయి. జూబ్లీ అనే వెబ్ సిరీస్ అమెజాన్‌లోకి రాబోతోంది.

Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More