Home> వినోదం
Advertisement

Dhamaka Vs 18 Pages : మాస్ సినిమాలకు ఉండే క్రేజ్ అదే.. 18 pages సినిమాపై ధమాకాదే పై చేయి

Ravi Teja Dhamaka Collection రవితేజ ధమాకా సినిమా ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తోంది. మాస్ మహారాజా సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా క్రేజ్ ఎలా ఉంటుందో మరోసారి చూపించినట్టు అయింది. అసలే మాస్ ఆడియెన్స్ ఈ మధ్య మంచి ఆకలితో ఉన్న సంగతి తెలిసిందే.

Dhamaka Vs 18 Pages : మాస్ సినిమాలకు ఉండే క్రేజ్ అదే.. 18 pages సినిమాపై ధమాకాదే పై చేయి

Dhamaka Vs 18 Pages Boxoffice సినిమాలకు ఎప్పుడూ మాస్ ప్రేక్షకులే బలం. అందుకే మన హీరోలు ఎక్కువగా మాస్ ఇమేజ్ కావాలని పరితపిస్తుంటారు. బీ, సీ సెంటర్లలో సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లలో మోత మోగిపోతుంది. అదే క్లాస్ సినిమా, మల్టీ ప్లెక్స్ ఆడియెన్స్‌కు నచ్చిన సినిమా అయితే కలెక్షన్లు కాస్త మెల్లిగా పుంజుకుంటాయి. ఇక ఈ వారం ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. రవితేజ ధమాకా ఫుల్ మాస్ సినిమా కాగా.. నిఖిల్ 18 Pages సినిమాకు కాస్ల క్లాస్ టచ్‌ ఉంది.

ప్రేమ, ఎమోషనల్, కవిత్వంతో కూడిన డైలాగ్స్, కొత్త స్క్రీన్ ప్లే ఇవన్నీ క్లాస్ ఆడియెన్స్‌ను బాగా మెప్పించాయి. సింగిల్ స్క్రీన్స్‌లోనూ ఈ సినిమా బాగానే ఆడేస్తోంది. కానీ రవితేజ స్టామినా ముందు, ధమాకా మాస్ టాక్ ముందు నిఖిల్ 18 pages కాస్త తగ్గాల్సి వస్తోంది. అందుకే మొదటి మూడు రోజుల్లో ఈ కలెక్షన్లలో అంత తేడా కనిపిస్తోంది.

 

ఓవర్సీస్‌లోనూ వెరైటీ మాస్ సినిమా అయినా ధమాకాకే మంచి వసూళ్లు వస్తున్నాయి. అక్కడ కూడా 18 Pages సినిమా కాస్త వెనుకంజలోనే ఉంది. కానీ రెండు సినిమాలకు మంచి వసూళ్లే వస్తున్నాయి. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వసూళ్లు అందరినీ ఆశ్చర్యపరుస్తోన్నాయి. 

 

మేకర్లు చెబుతున్న లెక్కల ప్రకారం ధమాకా సినిమాకు మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 32 కోట్ల గ్రాస్ వచ్చింది. అదే సమయంలో 18 pages సినిమాకు అయితే 11 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే నిఖిల్ సినిమా కంటే రవితేజ మూడు రెట్ల వసూళ్లను సాధించాడన్న మాట. అందుకే మన హీరోలు ఎక్కువగా మాస్ ఇమేజ్‌ను కోరుకుంటారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ దిశగానే వెళ్తోన్నాయి. డబుల్ బ్లాక్ బస్టర్‌గా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Also Read : Adivi Sesh Supriya Dating : అడివి శేష్‌-సుప్రియ డేటింగ్‌?.. దూరంగా నాగ చైతన్య.. ఆ పిక్‌తో సీక్రెట్ రివీల్

Also Read : Mouni Roy Pics : మౌనీ రాయ్.. కొంప ముంచేసేలా ఉందోయ్.. ఎగసిపడుతున్న ఎద అందాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More