Home> వినోదం
Advertisement

Ratnam Movie: విశాల్ ఉగ్రరూపం.. ‘రత్నం’ మూవీ నుంచి సంక్రాంతి స్పెషల్ పోస్టర్

Vishal Ratnam Movie Poster: విశాల్ లేటెస్ట్ మూవీ రత్నం సమ్మర్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి సంక్రాంతి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విశాల్ ఉగ్రరూపాన్ని పోస్టర్‌లో చూపించారు. 
 

Ratnam Movie: విశాల్ ఉగ్రరూపం.. ‘రత్నం’ మూవీ నుంచి సంక్రాంతి స్పెషల్ పోస్టర్

Vishal Ratnam Movie Poster: మాస్ యాక్షన్ హీరో విశాల్ రత్నం చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరీ డైరెక్టర్‌గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి  దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు ఇలా ఇప్పటి వరకు వదిలిన ప్రతీ అప్డేట్ అందరినీ ఆకట్టుకున్నాయి.

తాజాగా విశాల్ తన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. రత్నం సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్‌లో విశాల్ ఉగ్రరూపాన్ని చూపించారు. వెనకాల బ్యాక్ గ్రౌండ్‌లో కాళీ మాతను కూడా చూపించారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే తెరపై ఊచకోత గ్యారెంటీ అన్నట్టుగా కనిపిస్తోంది.

సమ్మర్‌లో రత్నం సినిమాను విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సంబంధించిన మిగతా అప్డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ మూవీకి లిరిక్స్‌ రైటర్‌ వివేక్ పాటలు రాశారు. ఇక కెమెరా మాన్‌గా సుకుమార్ పని చేయగా, టీ ఎస్ జయ్ ఎడిటింగ్‌ చేశారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా  పీవీ బాలాజీ పని చేశారు. స్టంట్ మాస్టర్లుగా  కనల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలిప్ సుబ్రయాన్, విక్కీ వర్క్ చేశారు.

Also Read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More