Home> వినోదం
Advertisement

Rashmika Mandanna: లక్కు తోక తొక్కిన రష్మిక.. మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్.. కరణ్ జోహార్ ప్రొడక్షన్లో!

Rashmika Mandanna to act with Tiger Shroff: ఇప్పటికే బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిస్టర్ మజ్ను సినిమాతో రష్మిక మందన్న బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది.  శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న సినిమాలో రష్మిక పేరు ఖరారు అయినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

Rashmika Mandanna: లక్కు తోక తొక్కిన రష్మిక.. మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్.. కరణ్ జోహార్ ప్రొడక్షన్లో!

Rashmika Mandanna to act with Tiger Shroff: కన్నడ కస్తూరి రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఆ సినిమాలతో హిట్స్ అందుకుంటూ ముందుకు వెళ్తోంది.. కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమా చేసిన ఆమె ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం కూడా చేసుకొని తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు రావడంతో ఆ నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకుంది. 

ఇక ఇటీవలే పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె కేవలం తెలుగు భాషకే పరిమితం కాకుండా తమిళ,  హిందీ,  కన్నడ భాషల్లో కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. ఇప్పటికే కార్తీ సరసన సుల్తాన్ అనే సినిమాలో నటించి తమిళ సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్న ఈ భామ బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటూ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. 

ఇప్పటికే బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిస్టర్ మజ్ను సినిమాతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆ తర్వాత అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న గుడ్ బాయ్ అనే సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో నటిస్తోంది. ఇక మరోపక్క రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రూపొందుతున్న యానిమల్ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న ఆమె ఇప్పుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. 

శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న సినిమాలో రష్మిక పేరు ఖరారు అయినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించనున్నారట. అలా చూసుకుంటే గనక బాలీవుడ్లో ఆమె చేతిలో ఇప్పుడు వరుసగా నాలుగు సినిమాలు ఉన్నట్లు చెప్పాలి. ఇలా తక్కువ కాలంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లలో రష్మిక మందన్న పేరు ముందు వరుసలో వినిపిస్తోంది.

Also Read: Priya Anand: నిత్యానందతో ప్రియా ఆనంద్ పెళ్లి.. సింక్ కోసం రెడీ అంటున్న భామ!

Also Read: Urfi Javed: ఇలాంటి డ్రెస్ ఎప్పుడన్నా చూశారా.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే.. పరువాల వడ్డనకు ఇదో దారి!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More