Home> వినోదం
Advertisement

Rashmika Mandanna: రాహుల్‌ రవీంద్రన్‌కు ఓకే చెప్పిన రష్మిక.. కొత్త ప్రయోగం ఫలించేనా?

దక్షిణాదిన టాప్‌ హీరోయిన్‌గా ఉన్న రష్మిక మందన్న ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాకు ఓకే చెప్పిందని సమాచారం తెలుస్తోంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించనున్నారు.

 Rashmika Mandanna: రాహుల్‌ రవీంద్రన్‌కు ఓకే చెప్పిన రష్మిక.. కొత్త ప్రయోగం ఫలించేనా?

Rashmika Mandanna to act in Rahul Ravindran's Women-Oriented film: కన్నడ సోయగం రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం టాలీవుడ్‌ (Tollywood)లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు. వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందం, నటనతో ఆకట్టుకున్న రష్మిక.. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మికకు మంచి మార్కులే పడ్డాయి. రష్మిక కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు కొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యారు. ఓ లేడీ ఓరియెంటెడ్‌ (Women Centric) సినిమా కన్నడ భామ చేస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. 

దక్షిణాదిన టాప్‌ హీరోయిన్‌గా ఉన్న రష్మిక మందన్న ఓ లేడీ ఓరియెంటెడ్‌ (Lady Oriented) సినిమాకు ఓకే చెప్పిందని సమాచారం తెలుస్తోంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul Ravindran) దర్శకత్వం వహించనున్నారు. రాహుల్ చెప్పిన సరికొత్త కథ రష్మికకు బాగా నచ్చిందని, దాంతో ఆమె వెంటనే సినిమాకు అంగీకరించిందని అంటున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందని తెలిసింది. మొత్తానికి మిగతా నాయికల మాదిరే రష్మిక కూడా మహిళా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. రష్మిక తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

Also Read: Pooja Hegde: టూ పీస్ బికినీలో పూజా హెగ్డే అందాల ఆరబోత.. ధర ఎంతో తెలుసా?!!

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్... పరిశ్రమ ఏదైనా ప్రస్తుతం అగ్ర కథానాయికలు ఓ వైపు కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టిపెడుతున్నారు. నయనతార, అనుష్క శెట్టి, త్రిష, ప్రియమణి లాంటో సీనియర్ కథానాయికలు ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలలో తన సత్తాచారు. ముఖ్యంగా నయనతార, అనుష్కలు వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఏ జాబితాలో కన్నడ సోయగం రష్మిక మందన్న కూడా చేరనున్నారు. రష్మికను రాహుల్‌ రవీంద్రన్‌ ఎలాంటి పాత్రలో చూపిస్తారో వేచి చూడాలి. 

ఛలో' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన కన్నడ భామ 'రష్మిక మందన్న' (Rashmika Mandanna). మొదటి సినిమాలోనే తన అందం, నటనతో ఆకట్టుకున్న రష్మిక.. 'గీత గోవిందం' చిత్రంతో టాలీవుడ్‌లో స్టార్ అయ్యారు. ఆ సినిమా సక్సెస్ కారణంగా అనతికాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్, భీష్మ, సరిలేరు నీకెవ్వరు, సుల్తాన్ తదితర సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 

Also Read: Bigg Boss Telugu Season 6 Update: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఎప్పుడో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More