Home> వినోదం
Advertisement

Rashmika Mandanna: చావు నుంచి తప్పించుకున్న రష్మిక మందన్న…హీరోయిన్ పోస్ట్ వైరల్

Rashmika Viral Post: ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెగ దూసుకుపోతున్న హీరోయిన్  రష్మిక మందన్న… ఈ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ లో చావు నుంచి తప్పించుకున్నాను అని పోస్ట్ పెట్టడంతో ఆ పోస్ట్ కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది..

Rashmika Mandanna: చావు నుంచి తప్పించుకున్న రష్మిక మందన్న…హీరోయిన్ పోస్ట్ వైరల్

Rashmika Mandanna Viral Instagram Status: 

సౌత్ ఇండియాలో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక అల్లు అర్జున్ పుష్పా సినిమా ద్వారా బాలీవుడ్ లో సైతం హవా కొనసాగించింది. పుష్ప రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ హీరోయిన్ కి అన్ని భాషలలోనూ తెగ ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా సందీప్ కిషన్ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి రష్మికా కు  హిందీలో మరిన్ని ఆఫర్లు తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం రష్మిక నటించని భాష లేదు అన్నట్టు.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో రష్మికకి సంబంధించిన ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. హీరోయిన్ శ్రద్ధా దాస్ తో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. “మీ సమాచారం కోసం తెలియజేస్తున్నాము. ఈరోజు మేము చావు నుంచి ఇలా తప్పించుకున్నాము” అని చెబుతూ తమ కాళ్ళని చూపిస్తున్న ఒక ఫోటోని షేర్ చేసింది. ఈ పోస్టు వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలియడం లేదు గానీ.. ఫోటో చూస్తే మాత్రం.. ఈ ఇద్దరు హీరోయిన్స్ జర్నీలో ఉన్నారని, ఆ సమయంలోనే ఏదో జరిగిందని అర్ధమవుతుంది. ఇక ఇదే పోస్టుని శ్రద్ధా దాస్ కూడా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు రష్మిక కి ఏమయింది అంటూ అభిమానులు కామెంట్లు కూడా పెడుతున్నారు. 

మరోపక్క ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌ తో కలిసి పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యూనిట్ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తుంది. కాగా ఈ సినిమా ఇప్పుడు మూడు పార్టులుగా రాబోతుందని సమాచారం. బెర్లిన్ ఫెస్టివల్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మూడో పార్ట్ కూడా ఉండొచ్చు అంటూ హింట్ ఇచ్చేసారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర రెండో భాగం ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది.

Also read: Paytm FAQs and Answers: పేటీఎంపై మీ సందేహాలు ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు

Also read: Iswarya Menon: ఎరుపెక్కిన అందాలతో హీటెక్కిస్తున్న ఐశ్వర్య మీనన్, లేటెస్ట్ పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More