Home> వినోదం
Advertisement

Rashmika Mandanna Viral Tweet: చూస్తుండగానే పెద్దది అయిపోతోంది.. రష్మిక ఎమోషనల్ కామెంట్

Rashmika Mandanna About Her Sister: రష్మిక మందాన్నకు చిట్టి చెల్లి ఉన్న సంగతి తెలిసిందే. నాలుగో తరగతో ఐదో తరగతో చదివే చెల్లి ఉందన్న విషయం విదితమే. ఇక రష్మిక ఫ్యామిలీ, తల్లిదండ్రుల మీద వచ్చే ఫన్నీ మీమ్స్ అందరికీ తెలిసిందే.

Rashmika Mandanna Viral Tweet: చూస్తుండగానే పెద్దది అయిపోతోంది.. రష్మిక ఎమోషనల్ కామెంట్

Rashmika Mandanna About Her Sister: రష్మిక మందాన్న తాజాగా రష్‌ అవర్స్ అంటూ ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు, అభిమానులు కురిపించిన ప్రేమకు స్పందించింది. ఇక తమిళం నెక్ట్స్ సినిమా ఎప్పుడు అని ఒకరు.. విజయ్ గురించి చెప్పమని ఇంకొకరు ఇలా రకరకాల ప్రశ్నలతో రష్మికను ఉక్కిరి బిక్కిరి చేసేశారు. ఈ క్రమంలో రష్మిక చెల్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. షిమాన్ ఎలా ఉందంటూ ఓ నెటిజన్ అడిగేశాడు. ఆమె ఏ క్లాస్ చదువుతోందని ప్రశ్నించాడు.

తన చెల్లి షిమాన్ గురించి రష్మిక చెబుతూ ఎమోషనల్ అయింది.. తనకు దూరంగా ఉన్నప్పుడల్లా మిస్ అవుతాను అని, చూస్తుండగానే ఎంతో పెద్దది అవుతోందని, ఇప్పుడు నాలుగో తరగతి నుంచి ఐదో తరగతికి వెళ్తుందని, ఇప్పుడు అయితే పరీక్షలు నడుస్తున్నాయని, తనకు ఆల్ ది బెస్ట్ చెప్పమని రష్మిక కోరింది.

ఇక రష్మికను తమిళంలో ఇంకో సినిమా ఎప్పుడు అని అడిగితే ఫన్నీగా సమాధానం ఇచ్చింది. వారిసు వచ్చి రెండు నెలలే అవుతోందిగా. కొత్త సినిమా సెట్ అయితే చెబుతాను అంటూ సమాధానం ఇచ్చింది. ఇక వారిసు సెట్‌లో ఫన్ని ఇన్సిడెంట్‌లు చెప్పమని ఓ నెటిజన్ అడిగాడు.

సెట్‌లో అటూ ఇటూ తిరుగుతుంటుంటే.. డైరెక్టర్ వంశీ ఫోటోలు తీసేవాడట.. వాటిని విజయ్‌కి చూపించేవాడట. ఇద్దరూ కలిసి తన మీద జోకులు వేసుకునే వారట. విజయ్ అంటే తనకు లవ్ అని సమాధానం ఇచ్చింది రష్మిక. ఇక తన మీద ట్రోలింగ్ వచ్చినా, నెగెటివ్ కామెంట్లు చేసినా పర్లేదు గానీ తన ఫ్యామిలీ మీద, తన చెల్లి మీద కూడా ట్రోలింగ్ చేస్తున్నారంటూ ఆ మధ్య బాధపడింది రష్మిక.

తెలుగులో రష్మికకు కొత్త ప్రాజెక్ట్ సెట్ అయ్యేలానే ఉంది. భీష్మ కాంబో రిపీట్ కానుందని టాక్. వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందాన్న కలిసి మళ్లీ ఓ సినిమాను చేయబోతోన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను లాంచ్ చేస్తారట.

Also Read:  Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన

Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More