Home> వినోదం
Advertisement

Rashmi Gautam: కొంటె చూపులు, నడుము అందాలతో మతి పోగొడుతున్న రష్మీ గౌతమ్

Rashmi Gautam Latest Photoshoot: యాంకర్, నటి రష్మీ గౌతమ్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బ్లూ అండ్ పింక్ 'లెహెంగా' ఔట్‌ఫిట్‌లో.. కొంటె చూపులతో రష్మీ గౌతమ్ ఫోటోలకు పోజులిచ్చింది.

Rashmi Gautam: కొంటె చూపులు, నడుము అందాలతో మతి పోగొడుతున్న రష్మీ గౌతమ్

Rashmi Gautam Latest Photoshoot: బుల్లితెరపై 'జబర్దస్త్' షో యాంకర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. అటు జబర్దస్త్‌తో పాటు ఢీ తదితర షోల్లో సందడి చేస్తూనే అడపాదడపా సినిమాల్లోనూ మెరుస్తోంది. అందచందాలతో పాటు ఆకట్టుకునే అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి సరసన 'భోళా శంకర్' సినిమాలో నటించనుంది. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను రష్మీ గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

fallbacks

బ్లూ అండ్ పింక్ 'లెహెంగా' ఔట్‌ఫిట్‌లో.. కొంటె చూపులతో రష్మీ గౌతమ్...

fallbacks

లెహెంగా ఔట్‌ఫిట్‌లో రష్మీ గౌతమ్‌ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 'బ్యూటీఫుల్..' అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. 'బుట్టబొమ్మలా ఉన్నారు మేడమ్...' అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

fallbacks

చివరిసారిగా రష్మీ గౌతమ్ 'శివ రంజనీ' అనే సినిమాతో వెండి తెరపై సందడి చేసింది. ఈ ఏడాది ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ కొట్టేసింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న 'భోళా శంకర్'లో నటించనుంది.

fallbacks

చిరంజీవితో నటించే భోళా శంకర్‌లో రష్మీ గౌతమ్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్వయంగా చిరంజీవే రష్మీ గౌతమ్‌ను రిఫర్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

fallbacks

రష్మీ గౌతమ్ ఇప్పటివరకూ దాదాపుగా 20 చిత్రాల్లో నటించింది. ఇందులో 'గుంటూరు టాకీస్', 'ప్రస్థానం' సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్‌గా నిలిచాయి. మిగతా సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.

fallbacks

సినిమాల పరంగా ఇప్పటివరకూ ఆశించిన బ్రేక్ రానప్పటికీ రష్మీకి అవకాశాలు మాత్రం తగ్గలేదు. చిరంజీవితో నటించే సినిమాతో రష్మీ కెరీర్ మరింత స్పీడ్ అందుకునే అవకాశం లేకపోలేదు.

Also Read: Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉంటుందా?.. కేటీఆర్ ఏమన్నారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More