Home> వినోదం
Advertisement

Ranbir- Rashmika: మనాలీలో 'యానిమల్' టీం సందడి.. రణ్​బీర్, రష్మిక ఫోటోలు వైరల్

Animal: రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న చిత్రం 'యానిమల్'. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మనాలిలో మెుదలైంది. 
 

Ranbir- Rashmika: మనాలీలో 'యానిమల్' టీం సందడి.. రణ్​బీర్, రష్మిక ఫోటోలు వైరల్

Ranbir Kapoor- Rashmika Mandanna: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'యానిమల్' (Animal Movie). ఈ క్రేజీ ప్రాజెక్టులో రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ అక్కడకు చేరుకుంది. పెళ్లి జరిగి వారం రోజులు కూడా కాకుండానే షూటింగ్ లో పాల్గొన్నాడు రణబీర్ (Ranbir Kapoor). ఈ చిత్రంలో పరిణీతి చోప్రా ముందుగా హీరోయిన్ గా ఎంపికైంది. కానీ ఇంతియాజ్ అలీతో కలిసి పనిచేయడానికి ఇష్టం లేక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. 

షూటింగ్ కోసం మనాలి వెళ్లిన చిత్రబృందానికి అక్కడి స్థానిక యంత్రాంగం సాంప్రదాయబద్దంగా ఘనస్వాగతం పలికింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్‌ కుమార్‌, ప్రణవ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని 2023 ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Also Read: Sarkaru vaari paata update: మహేశ్ మూవీ నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. టైటిల్ సాంగ్ వచ్చేది రేపే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More