Home> వినోదం
Advertisement

Ranbir Kapoor: 'యానిమల్‌' హీరో రణ్‌బీర్‌ గ్యారేజ్‌లోకి కొత్త కారు.. ఈ కారు ఫీచర్లు, ధర తెలిస్తే షాకే..

Ranbir Kapoor Buy New Bentley Continental Car: సినిమా తారలు కొత్త కార్లపై మోజు పెంచుకుంటున్నారు. ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ కొత్త కార్లు కొనుగోలు చేయగా తాజాగా యానిమల్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ కొత్తది కొన్నారు. ఆ కారు ధర వింటే బైర్లు కమ్ముతాయి.

Ranbir Kapoor: 'యానిమల్‌' హీరో రణ్‌బీర్‌ గ్యారేజ్‌లోకి కొత్త కారు.. ఈ కారు ఫీచర్లు, ధర తెలిస్తే షాకే..

Ranbir Kapoor New Car: తన సినిమా సంచలన విజయోత్సాహంతో హీరో పండుగ చేసుకుంటున్నాడు. తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కావడంతో ఆ హీరో ఆనందానికి అవధుల్లేవు. ఆ చిత్రం విజయంతో అత్యంత ఖరీదైన.. విలాసవంతమైన కారును కొనుగోలు చేశాడు. ఆ కారు విలువ కళ్లు చెదిరేలా ఉంది. ఇంతకీ కారు కొన్నది ఎవరో కాదు 'యానిమల్‌' సినిమా హీరో రణ్‌బీర్‌ కపూర్‌. 

Also Read: Jr NTR New Car: కొత్త కారు కొన్న 'దేవర'.. జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త కారు ధర, మోడల్‌ ఏమిటో తెలుసా?

గతేడాది తెలంగాణ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్‌' భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ఆ సినిమాలో రష్మిక మందన్నా, త్రిప్తి డిమ్రీ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు భారీగా లాభాలు వచ్చాయి. దీంతో చిత్రబృందం సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రబృందానికి భారీగా డబ్బులు కూడా వచ్చాయని తెలుస్తోంది. ఎవరికెంతో ఏమో గానీ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కు మాత్రం భారీగా దక్కినట్లు సమాచారం.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌ కొత్త కారు.. అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ...

ఆ సినిమా విజయంతో వచ్చిన డబ్బులతో రణ్‌బీర్‌ ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన.. ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తున్నాడు. గతేడాది బెల్‌గ్రేవియా గ్రీన్‌ ఎక్స్‌టీరియర్స్‌తో కూడిన రేంజ్‌ రేవర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త బెంట్లీ కాంటినెంటల్‌ కారును రణ్‌బీర్‌ కొనుగోలు చేశారు. ఆ కారును వేసుకుని ముంబైలోని తన ఇంటికి వెళ్తూ రణ్‌బీర్‌ కెమెరాకు చిక్కాడు. నల్లటి రంగు కారులో స్పోర్ట్స్‌ బనియన్‌ వేసుకుని ఉన్న రణ్‌బీర్‌ కనిపించాడు. వాహనం నడుపుతూ రణ్‌బీర్‌ వెళ్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న వారు క్లిక్‌మన్‌పించారు. ఆ వీడియో, ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

తాజాగా రణ్‌బీర్‌ కొన్న కారు విలువ అక్షరాల రూ. 8 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కారు అత్యంత భద్రతా వ్యవస్థతోపాటు అధునాతన.. విలాసవంతమైన సౌకర్యాలతో ఆ కారు ఉంటుంది. ఇప్పటికే చాలా కార్లు రణ్‌బీర్‌ వద్ద ఉండగా వాటిలో ఈ కారే అత్యంత ఖరీదైనదిగా బాలీవుడ్‌ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బెంట్లీ కాంటినెంటల్‌ కారు రణ్‌బీర్‌ కొనుగోలు చేశారనే వార్త తెలియగానే నెటిజన్లు వెంటనే గూగుల్‌ వెతకడం ప్రారంభించారు. ఆ కారు ధర ఎంత, కారు ప్రత్యేకతలు ఏమిటని వెతుకుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే నితీశ్‌ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ 'రామాయణం' సినిమా చేస్తున్నారు. ఈ కీలకమైన చిత్రంలో సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More