Home> వినోదం
Advertisement

Animal Movie Leaked: యానిమల్ టీమ్‌కు భారీ షాక్.. అప్పుడే ఆన్‌లైన్‌లోకి ఫుల్‌మూవీ

Animal Movie HD Print Leaked Online: యానిమల్ మూవీ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. విడుదలైన కాసేపటికే యానిమల్ ఫుల్ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం సంచలనంగా మారింది. కొన్ని వెబ్సైట్స్ వారు ఈ సినిమాని ఫుల్ క్లారిటీతో పెట్టేయడంతో సినీ ప్రేక్షకులు షాక్ కి గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా..  

Animal Movie Leaked: యానిమల్ టీమ్‌కు భారీ షాక్.. అప్పుడే ఆన్‌లైన్‌లోకి ఫుల్‌మూవీ

Animal Movie HD Print Leaked Online: అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషన్ సినిమా తీసిన తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా యానిమల్. అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా తీసి హిట్ అందుకున్న ఈ దర్శకుడు మరోసారి హిందీ హీరో అయిన రన్ బీర్ కపూర్ తో కలిసి ఈ యానియల్ సినిమాని తెరకెక్కించారు.

ఈ చిత్రంపై హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్ర ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈరోజు విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. 

కాగా ఇలాంటి టైం లో ఈ సినిమా టీమ్ కి పెద్ద షాక్ తగిలింది. అదేమిటి అంటే ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటలకి ఈ సినిమా హెచ్ డి ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయిపోయింది. ఈ సినిమా దాదాపు  3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు  రన్‍టైమ్ తో రాగా ఈ మొత్తం సినిమా ఆన్లైన్ లో పెట్టేయడంతో సినీ ప్రేక్షకులు షాక్ కి గురవుతున్నారు

రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అర్జున్ రెడ్డి తరహాలోని సందీప్ రెడ్డి ఈ సినిమాని తీసారని ఈ సినిమా కూడా అర్జున్ రెడ్డి అంత బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రేక్షకులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య బంధం గురించి వచ్చిన ఈ సినిమాలో రణబీర్ కపూర్  యాక్షన్ ఎక్సలెంట్ గా ఉంది అని ట్విట్టర్ లో పోస్టులు వేస్తున్నారు. మరి పైరసీ నుంచి బయటపడి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే వేచి చూడాలి. ఇక ఆలానే ఈ సినిమా టీం పైరసీ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా తెలియాల్సి ఉంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More