Home> వినోదం
Advertisement

RamGopal Varma: రణబీర్ కాకపోతే విజయ్.. ఇక ఎవ్వరు అలాంటివి చెయ్యలేరు: రామ్ గోపాల్ వర్మ

Ranbir Kapoor Animal Collections: రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్గా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుంది. 500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం ఇంకా కూడా జోరు తగ్గించకుండా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెగ నచ్చేసిన రామ్ గోపాల్ వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

RamGopal Varma: రణబీర్ కాకపోతే విజయ్.. ఇక ఎవ్వరు అలాంటివి చెయ్యలేరు: రామ్ గోపాల్ వర్మ

Vijay Devarakonda: యానిమల్ సినిమాని కొంతమంది ప్రశంసిస్తూ ఉంటే మరి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనా ఈ మిక్సడ్ రెస్పాన్స్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అనిమల్. మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ పైన తన సత్తా చూపించడం మొదలుపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా ఐదు వందల కోట్ల కలెక్షన్లు దాటేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పైన ఈ మధ్య తెగ ప్రశంసలు కురిపించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి రివ్యూ పెడుతూ ఏకంగా సందీప్ రెడ్డి కాళ్ల ఫోటోలు పంపి మనం అందరి దృష్టిని ఆయన వైపు తిప్పుకుంది. అయితే ఈ సినిమా తెగ నచ్చేసిన ఈ దర్శకుడు మరోసారి ఈ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.

కాగా ఈసారి సందీప్ రెడ్డి వంగాని కాకుండా ఆయన సినిమా హీరోలను తెగ మెచ్చుకున్నారు ఈ దర్శకుడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రణ్ బీర్ కాకుండా యానిమల్ సినిమాలోని విజయ్ పాత్రలో ఇంకెవ్వరినీ ఊహించుకోలేమని అన్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇలా చేయలేడని, చేస్తే ఒక్క విజయ్ దేవరకొండ మాత్రమే ఈ పాత్రను పోషించగలడు అంటూ కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

కాగా విజయ్ దేవరకొండ అని కూడా తెలుగులో స్టార్ హీరోగా మార్చిన చిత్రం సందీప్ రెడ్డివంగా సినిమా అర్జున్ రెడ్డి. ఇక మొట్టానికి సందీప్ రెడ్డి తన సినిమాలు చేసిన ఈ ఇద్దరు హీరోలను మెచ్చుకున్నారు వర్మ. 

అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగా మరి కొద్ది రోజుల్లో మరోసారి విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. మరి అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక యానిమల్ అవ్వగానే సందీప్‌కు ప్రభాస్, బన్నీలతో కమిట్మెంట్ ఉంది. వీటి తరువాతే సందీప్ విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ ఉంటుందని తెలుస్తోంది. 

Also Read:  New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..

Also Read:  CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More