Home> వినోదం
Advertisement

Sita Ramam: సీతారామం కథ ముందుగా వెళ్ళింది మెగా హీరోకి.. ఎందుకు వదులుకున్నారంటే?

Dulquer Salmaan Sita Ramam : చాలాకాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన ప్రేమ కథ సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో జీవించారు. కానీ నిజానికి ఆ సినిమాలో రామ్ పాత్ర దుల్కర్ సల్మాన్ కి బదులు మరొక హీరో చేయాల్సిందట. 

Sita Ramam: సీతారామం కథ ముందుగా వెళ్ళింది మెగా హీరోకి.. ఎందుకు వదులుకున్నారంటే?

Dulquer Salmaan: టాలీవుడ్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది, ఇక ప్రేమ కథలు బాక్స్ ఆఫీస్ వద్ద హీట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు అని అందరూ అనుకుంటున్న పరిస్థితుల్లో ధియేటర్ లలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అసలు ప్రేమ కథలు వర్క్ అవుతాయా అనుకుంటున్నా సమయంలో విడుదలై క్లాసిక్ సినిమాగా నిలిచింది. 

సినిమాలో సీత పాత్ర లో తన నటనతో మృణాల్ ఠాకూర్ అందరినీ ప్రేమలో పడేస్తే, రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అదరగొట్టేలా నటించారు. సినిమా క్లైమాక్స్ లో కూడా తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించారు. ఆ పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ పాత్రలో దుల్కర్ ని తప్ప.. మన తెలుగు ప్రేక్షకులు ఎవరు ఊహించుకోలేనంత గొప్పగా నటించారు.

కానీ నిజానికి రామ్ పాత్రలో దర్శకుడు ముందుగా దుల్కర్ సల్మాన్ ని ఊహించుకోలేదట. ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కి బదులు మరొక హీరో నటించాల్సిందట. సినిమా కథ దుల్కర్ సల్మాన్ కంటే ముందు మరొక హీరో విన్నారట. ఆ హీరో మరెవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అయితే కథ విన్న రామ్ చరణ్ మాత్రం తన ఇమేజ్ కి ఈ సినిమా స్టోరీ.. అంతగా సెట్ అవ్వదు అని రిజెక్ట్ చేశారట. ఒకవేళ రామ్ చరణ్ చేస్తున్న కూడా కథలో మార్పులు చేయాల్సి వచ్చేదేమో. 

కానీ అలా కథలో మార్పులు చేసి ఉంటే సినిమా ఇప్పుడు చేసినంత మ్యాజిక్ చేయలేకపోయేదేమో అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరికొందరు మాత్రం రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ని కాకుండా మరొక హీరోని ఊహించుకోవడం కూడా కష్టమని తేల్చి చెప్పేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయారు. 

ఇక ప్రస్తుతానికి రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న చెర్రీ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారు. 

రామ్ పాత్రని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేనంత అద్భుతంగా పోషించిన దుల్కర్ సల్మాన్ అటు మలయాళం సినిమాలు ఇటు తెలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. పేరుకి మలయాళం హీరో అయినప్పటికీ తన పాత్రలకి తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత బాగా దగ్గర అయిపోయారు దుల్కర్ సల్మాన్.

Read more: TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..

Read more: Vijayawada boy cpr: నువ్వు గ్రేట్ తల్లీ.... రోడ్డుపైన బాలుడికి సీపీఆర్ చేసిన లేడీ డాక్టర్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వైరల్ గా మారిన వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More