Home> వినోదం
Advertisement

Ram Charan's RC15 launch: రామ్‌చరణ్‌ ఆర్‌సీ 15 షురూ.. క్లాప్‌ కొట్టిన మెగాస్టార్ అతిథులుగా రాజ‌మౌళి,ర‌ణ్‌వీర్ సింగ్

Ram Charan's RC15 launch: మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్  రామ్‌చరణ్‌ 15 (Ramcharan 15) మూవీ  లాంచింగ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. చిరంజీవి క్లాప్ కొట్ట‌గా, రాజ‌మౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

 Ram Charan's RC15 launch: రామ్‌చరణ్‌ ఆర్‌సీ 15 షురూ.. క్లాప్‌ కొట్టిన మెగాస్టార్ అతిథులుగా రాజ‌మౌళి,ర‌ణ్‌వీర్ సింగ్

Ram Charan, Shankars film RC15 launch:  మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌.. (Ram Charan) ద‌ర్శ‌క ద‌గ్గ‌జం శంక‌ర్ (Shankar) ద‌ర్శ‌క‌త్వంలో వస్తోన్న కొత్త సినిమా పట్టాలెక్కింది. ఈ మూవీకి సంబంధించిన లాంచింగ్ అదిరిపోయింది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.  రామ్‌చరణ్‌.. ఆర్‌సీ 15 (RC15) ముహూర్తపు షాట్‌లో భాగంగా రామ్‌చరణ్‌పై  మెగాస్టార్‌‌ చిరంజీవి (Megastar Chiranjeevi)  క్లాప్‌ కొట్టారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇన్నేళ్లు బిజీగా ఉన్న రామ్ చ‌రణ్ రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. ఇక శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న పాన్ ఇండియా సినిమా కోసం బరిలో దిగనున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, (Rajamouli) బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్  రామ్‌చరణ్‌ 15 (Ramcharan 15) మూవీ  లాంచింగ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. చిరంజీవి క్లాప్ కొట్ట‌గా, రాజ‌మౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మ‌రి కొద్ది రోజుల్లోనే ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది.

Also Read : Pawan Kalyan remuneration: పవన్ కల్యాణ్ పారితోషికం రూ. 60 కోట్లా ?

పోస్టర్‌‌ రిలీజ్‌ 

ఈ సినిమా ప్రారంభం సందర్భంగా చిత్రయూనిట్ ఒక పోస్టర్‌‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారాఅద్వానీ (Kiara Advani) పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కీలకపాత్రధారి సునీల్, ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు అందరూ  బ్లాక్ సూట్‌లు ధరించి చేతిలో ఫైల్స్ , బ్యాగ్‌లతో కనిపిస్తారు.  వీ ఆర్ కమింగ్ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ పెట్టారు.

To new beginnings !!#RC15 #SVC50 kick starts today. Looking forward to deliver a memorable experience to one and all.@shankarshanmugh @advani_kiara @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official pic.twitter.com/VRkDfYneQi

జోడీగా కియారా అద్వానీ

ఈ మూవీలో రామ్‌చరణ్‌కు (RamCharan) జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్‌కు 50 సినిమా కావడం విశేషం. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు తమన్‌ స్వరాలు అందించనున్నారు. అంజలి, జయం రవి, శ్రీకాంత్‌, సునీల్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. 

Also Read : Ichata Vahanamulu Nilupa Radu: ఇచ్చట వాహనములు నిలుప రాదు ఓటిటి రిలీజ్ డీటేల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More