Home> వినోదం
Advertisement

Ram Charan Fans: ఉపాసనపై దారుణ వ్యాఖ్యలు.. సునిశిత్ ను చావచితక్కొట్టిన రామ్ చరణ్ ఫాన్స్

Ram Charan Fans Attacked Sunishit: వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సునిశిత్ అనే వ్యక్తి మీద రామ్ చరణ్ అభిమానులు దాడి చేసి చితక్కొట్టారు. ఆ వివరాల్లోకి వెళితే

Ram Charan Fans: ఉపాసనపై దారుణ వ్యాఖ్యలు.. సునిశిత్ ను చావచితక్కొట్టిన రామ్ చరణ్ ఫాన్స్

Ram Charan Fans Attacked Sunishit: సోషల్ మీడియాలో మైకు దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అది ప్రాణాల మీదకు రావడం ఖాయం అనేది తాజా సంఘటనతో తేటతెల్లమైంది. ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సునిశిత్ అనే వ్యక్తి మీద రామ్ చరణ్ అభిమానులు దాడి చేశారు. ఇంటి దగ్గరికి వెళ్లి మరీ అతని మీద దాడికి పాల్పడ్డ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్యకాలంలో సునిశిత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రాంచరణ్ సతీమణి ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసన మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఆమెను కించపరిచేలా ఉండడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు సునిశిత్ కామెంట్స్ కు తగిన రీతిలో స్పందిస్తూ అతనికి దేహశుద్ధి చేశారు. ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన ఆయన ఇంటికి వెళ్లిన అభిమానులు చితకబాదిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సునిశిత్ ను చితకబాదిన తర్వాత అదే వీడియోలో సునిశిత్ చేత క్షమాపణలు కూడా చెప్పించారు మెగా అభిమానులు.

Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!

‘నమస్కారం అండి, నా పేరు సునిశిత్ నేను ఒక చానల్లో తప్పుడు వ్యాఖ్యలు చేశానంటూ సునిషిత్ ఆ వీడియోలో చెబుతున్నారు. సోషల్ పోస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చేసినవి తప్పుడు వ్యాఖ్యలు అని తెలియజేస్తున్నానని, పొరపాటు అయిపోయింది. నేను చేసిన తప్పుకు రాంచరణ్ అభిమానులు నన్ను కొట్టడం జరిగిందని చెప్పకొచ్చారు. ఇంకోసారి ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు ఎవరి గురించి కానీ ఏ హీరో గురించి గానీ చేయనని పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను అని నన్ను క్షమించండి అని ఆయన చెప్పుకొచ్చారు.

ఉపాసన వదినమ్మకు రాంచరణ్ గారికి క్షమాపణలు ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు నేను చాలా బాధపడుతున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. నిజానికి ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ప్రేమికురాలని ఆమెకు తనకు వివాహం కూడా అయిందని అప్పట్లో సునిశిత్ కామెంట్ చేయగా ఈ వ్యవహారం మీద లావణ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిని అరెస్ట్ చేసి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు పోలీసులు. అయినా సునిశిత్ లో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.
Also Read: Chatrapathi Remake: దారుణంగా హిందీ ఛత్రపతి కలెక్షన్స్.. బొక్కబోర్లా పడ్డారుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
Read More