Home> వినోదం
Advertisement

Sapta Sagaragalu Dhaati OTT: థియేటర్లలో రిలీజైన వారం రోజుల్లోనే.. ఓటీటీలోకి 'సప్త సాగరాలు దాటి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sapta Sagaragalu Dhaati: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి న‌టించిన 'స‌ప్త సాగ‌రాలు దాటి' మూవీ థియేట‌ర్ల‌లో విడుదలైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. 
 

Sapta Sagaragalu Dhaati OTT: థియేటర్లలో రిలీజైన వారం రోజుల్లోనే.. ఓటీటీలోకి 'సప్త సాగరాలు దాటి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sapta Sagaradaache Ello - Side A ott release: కన్నడ హీరో ర‌క్షిత్ శెట్టి నటించిన నయా మూవీ  స‌ప్త సాగ‌ర దాచే ఎల్లో. ఈ మూవీని తెలుగులో 'స‌ప్త సాగ‌రాలు దాటి'(Sapta Sagaragalu Dhaati) అనే పేరుతో సెప్టెంబరు 22న రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్  థియేట‌ర్ల‌లో విడుద‌లైన వారం రోజుల్లోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. ఈ మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇది క‌న్న‌డతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ ఆడియోతో అందుబాటులో ఉండనుంది.

హేమంత్ ఎమ్ రావు ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ రొమాంటిక్ మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీలో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ క‌న్న‌డ సినిమాను స‌ప్త‌సాగ‌రాలు దాటి పేరుతో అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ తెలుగులోకి డ‌బ్ చేసింది.  క‌న్న‌డంలో సెప్టెంబ‌ర్ 1న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ర‌క్షిత్ శెట్టి, రుక్మిణి వ‌సంత్ యాక్టింగ్‌, డైరెక్ట‌ర్ టేకింగ్‌, మ్యూజిక్‌పై ప్రశంసలు జల్లు కురిసింది.

కారు డ్రైవ‌ర్‌గా పనిచేసే మను, ప్రియ‌(రుక్మిణి వ‌సంత్‌) ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకువాలనుకుంటారు. సొంత ఇళ్లు కట్టుకోవాలనేది వీరి డ్రీమ్. దానిని నెరవేర్చుకోవడం కోసం చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు మను. ఆ తర్వాత అతడి జీవితం ఎలా మలుపు తిరిగిందనేది స్టోరీ. దీనిని దర్శకుడు చాలా ఎమోషనల్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. పార్ట్ వ‌న్‌ను స‌ప్త సాగ‌ర దాచే ఎల్లో సైడ్ ఏగా రిలీజ్ చేశారు. సీక్వెల్‌ స‌ప్త సాగ‌ర దాచే ఎల్లో సైడ్ బీగా విడుదల చేయనున్నారు. దీనిని అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Also Read: Actor Siddharth: బెంగళూరులో హీరో సిద్ధార్థ్​కు ఘోర అవమానం, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More