Home> వినోదం
Advertisement

2.0 సినిమా టీజర్ వచ్చేస్తుందోచ్..!!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అభిమానులకి గుడ్ న్యూస్.

2.0 సినిమా టీజర్ వచ్చేస్తుందోచ్..!!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అభిమానులకి గుడ్ న్యూస్. ఈ ఇద్దరు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 2.0 సినిమా టీజర్ రేపే ఆడియెన్స్ ముందుకు రానుంది. ప్రముఖ సినీ విమర్శకుడు శ్రీధర్ పిళ్లై చేసిన ఓ ట్వీట్ ప్రకారం రేపు మలేషియాలోని నచ్చితిర విఝ అనే హోటల్ వేదికగా నిర్మాతలు ఈ టీజర్ ని లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. 

 

ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సైఫై మెగా బడ్జెట్ సినిమా కోసం దేశ వ్యాప్తంగా వున్న ఇరువురి అభిమానులు ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారు. కేవలం రజినీకాంత్, అక్షయ్ కుమార్ లు నటిస్తున్నారు అనే కాకుండా దర్శకుడు శంకర్ కి కూడా సొంతంగా ఓ అభిమాన వర్గం వుంది. శంకర్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ సినిమాపై ఫోకస్ చేసే వాళ్లు చాలామందే వున్నారు. శంకర్ గత ట్రాక్ రికార్డ్ అటువంటిది. 

2010లో శంకర్ డైరెక్ట్ చేసిన రోబో సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించగా.. అమీ జాక్సన్ సూపర్ స్టార్ సరసన ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. అక్షయ్ కుమార్ మొదటిసారిగా నటిస్తున్న కావడం.. అందులోనూ ఇందులో విలన్ పాత్ర చేస్తుండటం లాంటి పలు అంశాలు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ లాంటివి. మరి ఇన్ని విశేషాలు కలిగిన 2.0 సినిమా టీజర్ ఎలా వుండనుందో తెలియాలంటే రేపటివరకు వేచిచూడాల్సిందే. 

Read More