Home> వినోదం
Advertisement

Prabhas: అందుకే ప్రభాస్ కి ఎప్పటికీ పెళ్లి కాదు.. అసలు విషయం బయటపెట్టిన రాజమౌళి

Prabhas - Rajamouli: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో.. మొదటగా ఉండేది ప్రభాస్ పేరే. అయితే ప్రభాస్ పెళ్లి గురించి.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి గతంలో ఎప్పుడో చేసిన కామెంట్లు.. మరొకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో.. వైరల్ గా మారాయి. ప్రభాస్ అందుకే పెళ్లి చేసుకోడు.. అంటూ రాజమౌళి చేసిన కామెంట్లు.. అందరి దృష్టిని ఆకర్షించాయి.

Prabhas: అందుకే ప్రభాస్ కి ఎప్పటికీ పెళ్లి కాదు.. అసలు విషయం బయటపెట్టిన రాజమౌళి

Prabhas Wedding: టాలీవుడ్ లో ఇప్పటికీ పెళ్లి కాకుండా.. చాలా ఏళ్లుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితాలో..మొదటి స్థానంలోనే ఉన్న పేరు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దే. ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు.. కళ్ళుకాయలు కాచేలా.. ఎదురుచూస్తున్నారు. 

44 ఏళ్లు వచ్చేసిన ప్రభాస్ పెళ్లి పెళ్లి పైన ఒక్కొక్కరు ఒక్కో కామెంట్స్ పెడుతూ ఉంటారు. ప్రభాస్ జీవితంలో పెళ్లి చేసుకోరు.. అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభాస్ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. అసలు స్టార్ హీరో అయి ఉండి… అందం, చదువు, ఆస్తి ఇలా ఎందులోనూ కొదవలేని ప్రభాస్ కి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు.. అని చాలామందిలో ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. 

అయితే ఒకానొక సమయంలో ప్రభాస్ తో.. ఐదేళ్లు కలిసి బాహుబలి సినిమా కోసం పనిచేసిన.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రభాస్ పెళ్లి గురించి.. కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అనే విషయం మీద.. రాజమౌళి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. 

2020లో కాఫీ విత్ కరణ్ అనే సెలబ్రిటీ టాక్ షోలో రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి పాల్గొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ.. రాజమౌళి.. ప్రభాస్ పెళ్లి గురించి స్పందించారు. "ప్రభాస్ కి చాలా బద్ధకం ఎక్కువ. పెళ్లి చేసుకోవాలన్నా ప్రభాస్ కి బద్ధకమే. ఒక అమ్మాయిని కలిసి.. ఆమెను ప్రేమించి.. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం.. ప్రభాస్ కి చాలా పెద్ద పని. అందుకే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు" అని అన్నారు రాజమౌళి. 

రాజమౌళి ఇది సరదాగానే అన్న మాట. దాని గురించి స్పందిస్తూ ప్రభాస్ కూడా.. పలు ఇంటర్వ్యూలలో నిజంగానే తనకి బద్ధకం, మొహమాటం ఎక్కువ అని, కొత్త వాళ్లతో మాట్లాడలేనని అన్నారు. అయితే ఇదంతా జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటికి కూడా ప్రభాస్ ఇంకా పెళ్లి కాకుండా.. సింగల్ గానే ఉన్నారు.

దీంతో రాజమౌళి అప్పట్లో అన్న మాటలు.. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల పరంగా చూస్తే.. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్ కూడా చేతినిండా.. సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన.. కల్కి సినిమా ఈనెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More