Home> వినోదం
Advertisement

RRR Critics Choice awards : మరోసారి సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. ఉత్తమ విదేశీ చిత్రంగా రికార్డ్

RRR Critics Choice awards గోల్డెన్ గ్లోబ్ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. క్రిటిక్స్ చాయిస్ అవార్డ్‌లో భాగంగా నాటు నాటు పాటకు అవార్డు వచ్చింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆర్ఆర్ఆర్‌కు అవార్డు వచ్చింది.

RRR Critics Choice awards : మరోసారి సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. ఉత్తమ విదేశీ చిత్రంగా రికార్డ్

RRR Critics Choice awards ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇప్పుడు మరో అంతర్జాతీయ అవార్డు వచ్చింది. లాస్ ఏంజిల్స్ క్రిటిక్స్ చాయిస్ అవార్డుల్లో భాగంగా నాటు నాటు పాటను ఎంచుకున్నారు. ఇక ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డు వచ్చింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ తరువాత మళ్లీ ఇలా క్రిటిక్స్ చాయిస్ అవార్డు రావడంతో ఇంటర్నేషనల్ వైడ్‌గా ఆర్ఆర్ఆర్ ట్రెండ్ అవుతోంది.

అవార్డు రావడం కంటే.. రాజమౌళి ఇచ్చిన స్పీచు అందరినీ ఆకట్టుకుంది. అవార్డు అందుకున్న తరువాత రాజమౌళి ఇచ్చిన స్పీచుకు అందరూ ఫిదా అయ్యారు. తన తల్లి కారణంగానే తనకు కార్డూన బుక్స్ అలవాటు అయ్యాయని, అక్కడి నుంచే తనకు విజువలైజేషన్ పెరిగిందని అన్నాడు. ఇక తన వదిన వల్లి కారణంగానే సరైన దారిలో ప్రయాణించానని చెప్పుకొచ్చాడు. తన భార్య రమా తన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్ చేయడం మాత్రమే కాకుండా.. తన లైఫ్‌ను కూడా గొప్పగా డిజైన్ చేసిందని చెప్పుకొచ్చాడు.

ప్రసంగం చివర్లో మేరా భారత్ మహాన్ జై హింద్ అంటూ చెప్పేశాడు రాజమౌళి. ఇలా రాజమౌళి ఎంతో ఉద్వేగభరితంగా చెప్పిన మాటలు, ఇచ్చిన స్పీచును చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్‌గా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

ఆర్ఆర్ఆర్ టీం ఇప్పుడు లాస్ ఏంజిల్స్ నుంచి ఇండియాకు బయల్దేరింది. ఈ మేరకు కీరవాణి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నాలుగు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని వస్తున్నందుకు ఆనందంగా ఉంది.. బై బై లాస్ ఏంజిల్స్.. మళ్లీ త్వరలోనే వస్తాను అంటూ ఆస్కార్ గురించి పరోక్షంగా హింట్ వచ్చింది.

Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More