Home> వినోదం
Advertisement

Keeravani Honoured with Padma : కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా.. కీరవాణికి అవార్డుల వర్షంపై రాజమౌళి ట్వీట్

Keeravani Honoured with Padma Award సంగీత దర్శకుడు కీరవాణికి కేంద్రం పద్మ శ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి తన పెద్దన్న మీద ప్రేమను కురిపించాడు. అన్ని అవార్డులు ఒకేసారి వస్తున్నాయ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Keeravani Honoured with Padma : కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా.. కీరవాణికి అవార్డుల వర్షంపై రాజమౌళి ట్వీట్

Keeravani Honoured with Padma Award దర్శకధీరుడు రాజమౌళి ఇంట్లో గత కొన్ని రోజుల నుంచి వరుసగా సంబరాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం, ఆస్కార్‌ బరిలో నాటు నాటు పాట నిలవడం, ఇప్పుడు కేంద్రం నుంచి పద్మ పురస్కారం లభించడంతో రాజమౌళి ఎమోషనల్ అయ్యాడు. ఇలా అన్నీ ఒకేసారా? కాస్త గ్యాప్ ఇవ్వమ్మ అంటూ ఈ యూనివర్స్‌ను రాజమౌళి కోరాడు. ఈ మేరకు ఆయన వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

 

అభిమానులంతా అనుకున్నట్టుగా.. ఈ పురస్కారం ఎప్పుడో రావాల్సింది.. ఈ గుర్తింపు ఎన్నో ఏళ్ల క్రితమే రావాల్సింది..  కానీ ఈ విశ్వం, ప్రపంచం ఎప్పుడూ కూడా సరైన సమయంలో ఒకరి శక్తిని గుర్తిస్తుంది.. ఒక వేళ నేను ఆ యూనివర్స్‌తో మాట్లాడే చాన్స్ వస్తే.. కాస్త గ్యాప్ ఇవ్వు అమ్మా.. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకోటి ఇవ్వు అని చెబుతానంటూ రాజమౌళి వేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇంటర్నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నాటు నాటు పాట అయితే ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కించుకుని నాటు నాటు పాట చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ సాంగ్ విభాగంలోనూ నాటు నాటు నామినేట్ అయింది. ఇక ఆస్కార్‌కు ఒక్క అడుగు దూరంలో నాటు నాటు ఉంది. అది కూడా వస్తే ఇండియన్ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం అవుతుంది.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో కీరవాణికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. పాట రాసిన చంద్రబోస్ పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవలకు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద గుర్తింపు వచ్చింది. అలా భారతీయుడు, తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పినట్టు అయింది.

Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More