Home> వినోదం
Advertisement

Raj Tarun: వైరల్ గా రాజ్ తరుణ్ ఎఫైర్ లిస్ట్..పెద్ద ముదురే..!

Raj Tarun Case: ప్రముఖ హీరోయిన్ షాలిని పాండే, రిద్ది కుమార్, మాల్వి మల్హోత్రా వంటి హీరోయిన్లతో పాటు బిగ్ బాస్ బ్యూటీ అరియాణా గ్లోరీతో.. కూడా ఇతడికి ఎఫైర్ ఉందని.. రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఆమె చెప్పిన లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

Raj Tarun: వైరల్ గా రాజ్ తరుణ్ ఎఫైర్ లిస్ట్..పెద్ద ముదురే..!

Raj Tarun Affairs List: ప్రముఖ హీరో రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరియర్ మొదలుపెట్టి .. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. ఈ సినిమాతోనే మంచి ఇమేజ్ దక్కించుకున్న ఈయన.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే నాగార్జున, అల్లరి నరేష్ వంటి.. హీరోలతో నా సామిరంగ సినిమా చేశారు.. రాజ్ తరుణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకోగా..ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లలో బిజీగా ఉండగానే.. తాజాగా  రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన.. ఒక విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 

ఆయన ప్రేయసి లావణ్య.. ఇతడి బాగోతాలు బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ‘దాదాపు 11 సంవత్సరాల క్రితం రాజ్ తరుణ్ షార్ట్ ఫిలింలో చేసేటప్పుడు పరిచయమయ్యాడు.. అది కాస్త ప్రేమగా మారింది.. అప్పుడే గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నాము. నేను గర్భవతినైతే రెండు నెలలప్పుడు అబార్షన్ చేయించి.. ఆ డబ్బు కూడా అతనే.. పే..చేశాడు. దాదాపు అతడికి రూ.70 లక్షల వరకు ఇచ్చాను.. ఇప్పుడు ఇంకొకరితో ఎఫైర్ కారణంగా నన్ను దూరం పెట్టేశారు. దయచేసి న్యాయం చేయండి’.. అంటూ  కోరింది. అక్కడితో ఆగకుండా రాజ్ తరుణ్ ఎంతమంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడుపుతున్నాడు.. అనే విషయాలను కూడా ఆమె బట్టబయలు చేసింది. 

త్వరలో విడుదల కాబోతున్న తిరగబడరా స్వామి.. సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. ఆమె వల్లే తనను దూరం చేస్తున్నాడని..ఎలాగైనా సరే రాజ్ తరుణ్ తనకు కావాలి అంటూ పోలీసుల ముందు వేడుకుంది. ఆధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులు పంపించడంతో అన్ని ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చింది లావణ్య. ఇక తనకు, రాజ్ తరుణ్ కు మధ్య జరిగిన సంభాషలన్నింటినీ కూడా ఆమె షేర్ చేస్తూనే.. మరొకవైపు రాజ్ తరుణ్ కి ఎవరెవరితో ఎఫైర్ ఉంది.. అనే విషయాలను కూడా వెల్లడించింది. ప్రముఖ హీరోయిన్ షాలిని పాండే, రిద్ది కుమార్ వంటి హీరోయిన్లతో పాటు బిగ్ బాస్ బ్యూటీ.. అరియాణా గ్లోరీ తో కూడా ఇతడికి ఎఫైర్ ఉందని ఆమె తేల్చి చెప్పింది. అంతేకాదు వీరికి సంబంధించిన కాల్ రికార్డింగ్,  వాట్స్అప్ చాట్ స్క్రీన్ షాట్లను కూడా మీడియా ముందు వెల్లడించింది. ఇక దీంతో ఈ విషయం తెలిసి రాజ్ తరుణ్ మామూలు వాడు కాదు .. పెద్ద ముదురు అంటూ నెటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ను కలుస్తానని చెబుతున్న లావణ్య కు ఎటువంటి మేలు కలుగుతుందో చూడాలి.

Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More