Home> వినోదం
Advertisement

Rahul Ramakrishna Son : కొడుకుని ప్రపంచానికి పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ.. పేరు భలేగా ఉందే?

Rahul Ramakrishna Son రాహుల్ రామకృష్ణ తాజాగా తన కొడుకుని ప్రపంచానికి పరిచయం చేశాడు. కొడుకు మొహాన్ని అందరికీ చూపిస్తూ ఓ పేరు కూడా పెట్టేశామని చెప్పుకొచ్చాడు. అయితే ఆ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూమి అనే పేరు పెట్టినట్టుగా తెలిపాడు.

Rahul Ramakrishna Son : కొడుకుని ప్రపంచానికి పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ.. పేరు భలేగా ఉందే?

Rahul Ramakrishna Son Name Rumi టాలీవుడ్‌లో అతి కొద్ది కాలంలోనే కమెడియన్‌గా, మంచి ఆర్టిస్ట్‌గా పేరు సంపాదించుకున్నాడు రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్డం దక్కించుకున్నాడు. శివ పాత్రలో రాహుల్ రామకృష్ణ అదరగొట్టేశాడు. జాతి రత్నాలు సినిమాతో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ నటించి జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యాడు. అయితే రాహుల్ రామకృష్ణ పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీగానే ఉంటుంది. ఇప్పుడు రాహుల్ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన కొడుకును చూస్తూ మురిసిపోతోన్నట్టుగా ఉన్నాడు.

సంక్రాంతికి తన కొడుకు పుట్టాడని అందరికీ చెబుతూ సంబరపడిపోయాడు. ఇప్పుడు తన కొడుకుని ప్రపంచానికి పరిచయం చేశాడు. తన కొడుక్కి రూమి అనే పేరు పెట్టామని చెబుతూ వేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో రాహుల్ భార్య, బిడ్డల మొహాలు కనిపిస్తున్నాయి. జూ. రాహుల్ రామకృష్ణ వచ్చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఫోటోను తీసింది ఎవరో కూడా చెబుతూ.. ఆమె మీద వింతగా సైటర్ వేశాడు.

 

ఈ ఫోటోను తీసింది ప్రియాంక మొక్కపాటి.. ఆమె లేకపోతే ఇదంతా జరిగి ఉండేది కాదు అని అన్నాడు. అంటే వీరి ప్రేమ, పెళ్లికి కూడా ఆమె కారణమై ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ఆమె ఎవరన్నది.. ఆమెకు రాహుల్‌కు ఉన్న రిలేషన్ ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. ఇక రాహుల్ కొడుకుని, ఆ పేరుని చూసి జనాలు కంగ్రాట్స్ చెబుతున్నారు. పేరు కొత్తగా ఉందని, దాని అర్థం ఏంటి? అన్నా అని అభిమానులు అడుగుతున్నారు.

Also Read:  Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు అఖిల్ అక్కినేని వేధింపులు?.. చిర్రెత్తుకొచ్చి కేసు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ

ఇక రాహుల్ రామకృష్ణ పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. ముందుగా బిందు అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఆ తరువాత హరిత అతని లైఫ్‌లోకి వచ్చింది. డేటింగ్‌లో ఉండగానే.. వీరికి బిడ్డ పుట్టినట్టుంది. ఈ ఇద్దరికి ఎప్పుడు పెళ్లి జరిగిందనేది ఎవ్వరికీ తెలియకుండా ఉంది. పెళ్లి కాకుండా తండ్రి అయ్యాడంటూ అప్పట్లో కామెంట్లు వచ్చాయి. మొత్తానికి రాహుల్ మాత్రం ఈ దశను బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More