Home> వినోదం
Advertisement

SP Balasubrahmanyam Birth anniversary: పాటకు ప్రాణం SPB గొంతు, ఆ పాటలు ఇంకా వినిపిస్తుంటాయన్న Raghavendra Rao

SP Balasubrahmanyam Birth anniversary: 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ సినిమాకు తొలిసారిగా గాత్రం అందించి సినీ నేపథ్య గాయకుడుగా అరంగేట్రం చేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగారు. నేడు లెజెండరీ సింగర్ బాలు జయంతి సందర్భంగా ప్రముఖులు ఎస్పీ బాలు సేవల్ని గుర్తు చేసుకున్నారు.

SP Balasubrahmanyam Birth anniversary: పాటకు ప్రాణం SPB గొంతు, ఆ పాటలు ఇంకా వినిపిస్తుంటాయన్న Raghavendra Rao

SPB Birth anniversary: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946లో జూన్ 4న నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. అయితే అభిమానులు ఆయనను ఎస్పీబీ అని, బాలు అని, గాన గంధర్వుడు అని పిలుచుకునేవాళ్లు. పాటకే వన్నె తెచ్చిన సింగర్ బాలు అని ప్రముఖులతో కితాబు అందుకున్నారు.

1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ సినిమాకు తొలిసారిగా గాత్రం అందించి సినీ నేపథ్య గాయకుడుగా అరంగేట్రం చేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగారు. నేడు లెజెండరీ సింగర్ బాలు (SP Balasubrahmanyam) జయంతి సందర్భంగా ప్రముఖులు ఎస్పీ బాలు సేవల్ని గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. చాలా కాలం నుంచి సంగీత ప్రపంచం నిశ్శబ్ధంగా మారిపోయింది. అందుకు కారణం మన బాలు లేకపోవడం. సాధారణంగా పాటకు ప్రాణం పల్లవి అంటారు. నా దృష్టిలో బాలు గాత్రమే పాటకు ప్రాణమైనా, పల్లవి అయినా అని పేర్కొన్నారు.

Also Read: The family man 2: ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌‌లో Samantha ఎంట్రీ సీన్ చూశారా ?

ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అని పాడాలన్నా, అదిగో అల్లదిగో శ్రీహరి వాసమూ అని పాడాలన్నా బాలుకే సాధ్యమైంది. అలాంటి బాలు మన మధ్య లేకపోవడం బాధాకరం. మా ఇద్దరిది 50 ఏళ్ల అనుబంధం. ఇప్పటికీ బాలు పాటలు నా చెవిలో వినిపిస్తుంటాయి. కొందరు వెళ్లిపోతే అప్పుడప్పుడు గుర్తొస్తుంటారు. కానీ నాకు మాత్రం భక్తి పాటలు పెట్టినప్పుడల్లా బాలు గొంతు వినిపిస్తూనే ఉంటుంది. బాలు ఎప్పటికీ మనతోనే ఉంటాడు. అతడి సంగీతం వింటూనే ఉంటామని’ తన మనసులో మాటను, బాలుపై ప్రేమాభిమానాలను వీడియో రూపంలో Raghavendra Rao షేర్ చేసుకున్నారు.

Also Read: Shivani Rajashekar: కన్నులు చెదిరే అందాన్నే లిరికల్ సాంగ్ Youtubeలో ట్రెండింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More