Home> వినోదం
Advertisement

Radhe Shyam Story: థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి.. అంతలోనే స్టోరీ లీక్!

Radhe Shyam Story: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్'.. శుక్రవారం (మార్చి 11) థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల గురించి తెలిసింది. అదేంటో మీరు తెలుసుకోండి. 
 

Radhe Shyam Story: థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి.. అంతలోనే స్టోరీ లీక్!

Radhe Shyam Story: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. తమ అభిమాన హీరో నటించిన మూవీ 'రాధేశ్యామ్' మూవీ శుక్రవారం (మార్చి 11) వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. గురువారం రాత్రి నుంచి ప్రివ్యూ షోలను ప్రదర్శిస్తుండగా.. తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. 'బాహుబలి' సిరీస్, 'సాహో' సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడం వల్ల ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

1970లలో యూరప్ నేపథ్యంతో సాగిన ప్రేమకథగా 'రాధేశ్యామ్' సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం మరో టైటానిక్ ను తలపిస్తుందని సినిమా చూసిన అభిమానులు అంటున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తోంది. బాహుబ‌లి’, ‘సాహో’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో హీరో ప్రభాస్ గుర్తింపు పొందాడు. దీంతో ఈ సినిమాపై నిర్మాతలు రూ.300 కోట్లను ఖర్చు చేశారు. 

కథ ఏంటంటే?

హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాదిత్య పాత్రలో హీరో ప్రభాస్ తెరపై కనిపిస్తారు. ఈ కథ ఇటలీ నేపథ్యంలో సాగుతుంది. హస్త సాముద్రికంలో (పామిస్ట్) విక్రమాదిత్య అంచనాలు వందశాతం నిజమవుతాయి. ఇతర హస్త రేఖలను చూసి భవిష్యత్తును చెప్పే విక్రమాదిత్య.. తన చేతిలో ప్రేమకు సంబంధించిన రేఖ లేదని తెలుసుకుంటాడు. 

అయితే అనుకోకుండా ప్రేరణ (పూజా హెగ్డే) ను చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ, విక్రమాదిత్య ప్రేమించలేని పరిస్థితి. వాళ్లిద్దరికి ఎలా ముడిపడిందనేది తర్వాతి కథ. అయితే ఈ సినిమాలో.. త్యాగాన్ని కోరుకునే ప్రేమ.. తలరాత తెలిసిన విధిని మార్చలేని విక్రమాదిత్య.. విధి ముందుకు సంకల్పం ఎదురెళ్తే ఎంతటి అవాంతరాన్నైనా ఎదురించవచ్చనేది ఈ కథ బోధిస్తుంది. 

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించింది. కృష్ణంరాజు కీలక పాత్ర పోషించగా.. సచిన్ ఖేడేకర్, సత్యరాజ్, ప్రియదర్శి పులికొండ, భాగ్యశ్రీ, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రీ, సత్యన్ తదితరులు నటించారు. యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.  

Also Read: Radhe Shyam Review: అప్పట్లో శివ.. ఇప్పుడు రాధేశ్యామ్! ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్ కాదు..!!

Also Read: Radhe Shyam Movie: రాధేశ్యామ్ మూవీ సందడి షురూ.. సినిమాలోని విశేషాలు తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More