Home> వినోదం
Advertisement

Radhe Shyam Song Teaser: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుంచి రెండో సాంగ్ టీజర్ వచ్చేసింది!

Radhe Shyam Song Teaser: ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని రెండో సాంగ్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి లిరికల్ సాంగ్ ను డిసెంబరు 1న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Radhe Shyam Song Teaser: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుంచి రెండో సాంగ్ టీజర్ వచ్చేసింది!

Radhe Shyam Song Teaser: డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన రొమాంటిక్ చిత్రం 'రాధేశ్యామ్' నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన తొలి గీతం అలరిస్తుండగా, రెండో సాంగ్​ టీజర్​ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్​లో రిలీజ్ చేసింది చిత్రబృందం. పూర్తి పాటను డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు ఈ సాంగ్​ హిందీ వెర్షన్ టీజర్ ఉదయమే​ విడుదలై ఆకట్టుకుంటోంది. 

1970 నాటి ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా చేసింది. ఇందులో ప్రభాస్ హస్తరేఖలు చూసి భవిష్యత్తు చెప్పే వ్యక్తిగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్​ అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

ఈ చిత్రంలో సీనియర్ నటి భాగ్యశ్రీ కీలకపాత్ర పోషించింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా 'రాధేశ్యామ్' విడుదల కానుంది.

Also Read:  RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రిలీజ్?

ALso Read: Bigg Boss Telugu Season 5 Promo: ప్రియాంకకు బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More