Home> వినోదం
Advertisement

Pushpa 2: ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్, పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్

Pushpa 2: ప్రపంచవ్యాప్తంగా మేనియా రేకెత్తిన పుష్ప సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సినిమా సన్నివేశం కన్పిస్తుందట. అదేంటనుకుంటున్నారా..

Pushpa 2: ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్, పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఎంతటి మెగా హిట్ సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ ప్రారంభంతో చర్చ మళ్లీ ప్రారంభమైంది. 

సర్వత్రా ఆసక్తి రేపిన పుష్ప 2 సినిమా షూటింగ్ మొత్తానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. దీనికోసం ఒక ప్రత్యేక సెట్ ఏర్పాటైంది. సినిమాలోని కీలక సన్నివేశాల్ని ఇందులో చిత్రీకరించనున్నారు. అల్లు అర్జున్ ఈ సన్నివేశాల్లో లేకపోవడంతో..అతడు హాజరు కాలేదు. డిసెంబర్ నుంచి బన్నీ షూటింగ్‌లో పాల్గొననున్నాడు.

పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సినిమా సీన్

పుష్ప 2లో ఒక అద్భుతమైన సన్నివేశం కోసం చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ వెళ్లనుందని తెలుస్తోంది. అడవిలో పులితో పోరాడే సన్నివేశాన్ని థాయ్‌లాండ్ అడవుల్లో తెరకెక్కించనున్నారు. ఈ సీన్ ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పులితో చేసే ఫైటింగ్ సీన్ గుర్తుకువస్తుంది. 

పుష్ప మెగా హిట్ కావడంతో పుష్ప 2ను అంతకంటే భారీగా తీయాలనేది సినినా దర్శక, నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఖర్చు విషయంలో సుకుమార్‌కు పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చేశారని సమాచారం. పుష్ప 1 సినిమా 2021 డిసెంబర్ నెలలో విడుదలైంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాను 2023 డిసెంబర్ నాటికి విడుదలయ్యేట్టు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని పాత్రలు కొత్తగా చేరినా..ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రష్మిక మందన్నాలు పుష్ప 2లో కూడా కన్పించనున్నారు. 

Also read: Anusha Shetty Photos: నాగశౌర్యకు కాబోయే భార్య ఎంత అందంగా ఉందో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More