Home> వినోదం
Advertisement

ప్రియ ప్రకాశ్ వారియర్ కన్ను కొట్టిన సీన్ కాపీ కొట్టిందేనా ?

ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేసిన కేరళ కుట్టి ప్రకాశ్ వారియర్ కన్ను కొట్టిన సీన్ వేరొక సినిమా నుంచి కాపీ కొట్టిందేనా ?

ప్రియ ప్రకాశ్ వారియర్ కన్ను కొట్టిన సీన్ కాపీ కొట్టిందేనా ?

ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేసిన కేరళ కుట్టి ప్రకాశ్ వారియర్ కన్ను కొట్టిన సీన్ వేరొక సినిమా నుంచి కాపీ కొట్టిందేనా ? మళయాళం భాషలోనే తెరకెక్కిన మరో సినిమాలోని సన్నివేశాన్ని ఆధారంగా తీసుకుని ఒరు అడార్ లవ్ సినిమా డైరెక్టర్ ఒమర్ లులు ఈ సన్నివేశాన్ని రూపొందించాడా ? తాజాగా మజీబ్ అబు అనే మళయాళం డైరెక్టర్ చేస్తోన్న ఆరోపణలు, విడుదల చేసిన ఓ దృశ్యాన్ని చూసిన తర్వాత కొంతమందికి కలుగుతున్న సందేహాలు ఇవి. ప్రియ ప్రకాశ్‌పై తెరకెక్కించిన సన్నివేశం మాదిరిగానే చూపులు, సైగలతోనే ప్రేమను వ్యక్తీకరించే సన్నివేశాన్ని తాను డైరెక్ట్ చేసిన కిడు సినిమాలో తెరకెక్కించానని ఆ చిత్ర దర్శకుడు మజీబ్ అబు చెబుతున్నాడు. తన సినిమా షూటింగ్, ఎడిటింగ్ భాగం అంతా గతేడాది నవంబర్ 25వ తేదీకే పూర్తయింది. ఆ తర్వాతే తన సినిమాకు పనిచేసిన ఎడిటర్ అచు విజయన్.. ప్రియ ప్రకాశ్ నటించిన ఒరు అడార్ లవ్ సినిమాకు ఎడిటింగ్ పని చేయడం మొదలుపెట్టాడు. బహుశా అతడే ఈ సీన్‌ని ఒమర్ లులుకి లీక్ చేసి వుంటాడని ఆరోపించాడు మజీద్. వాస్తవానికి ఒమర్ లులుని చూసే మజీద్ అబు తన సినిమాలోని సన్నివేశాన్ని కాపీ చేశాడని వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ మజీబ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

 

ప్రియ ప్రకాశ్ వారియర్ కన్ను కొడుతూ నటించిన " మానిక్య మళరాయ పూర్వి " పాటపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ హైదరాబాద్‌లో ఓ కేసు నమోదవడం, ఈ నేపథ్యంలో ప్రియ ప్రకాశ్ వారియర్ సుప్రీం కోర్టుని ఆశ్రయించడం, సుప్రీం కోర్టు ఆమెకు అనుకూలంగా స్పందించడం లాంటి వరుస పరిణామాలన్నీ ఆమెని, ఆమె నటించిన సినిమాను నిరంతరం వార్తల్లో వుండేలా చేశాయి. 

ఇదిలా వుండగానే తాజాగా ఈ సీన్ కాపీ కొట్టి తెరకెక్కించిన సన్నివేశం అంటూ తెరపైకొచ్చిన కొత్త వివాదం ఈ కేరళ కుట్టిని, ఒరు అడార్ లవ్ సినిమాను మరోసారి వార్తల్లోకి తీసుకొచ్చాయి. 

Read More