Home> వినోదం
Advertisement

Prashanth Neel: సమస్యతో బాధపడుతున్న ప్రశాంత్ నీల్.. విషయం బయటపెట్టిన దర్శకుడు

Salaar Promotions: ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్.. పాన్ ఇండియా సూపర్ స్టార్.. కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంతే దానిపైన అంచనాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.. ప్రస్తుతం అలాంటి అంచనాలే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీరు దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రంపై నెలకొన్నాయి..

Prashanth Neel: సమస్యతో బాధపడుతున్న ప్రశాంత్ నీల్.. విషయం బయటపెట్టిన దర్శకుడు

Salaar: కేజిఎఫ్ సినిమాతో సెన్సేషన్ సృష్టించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బాహుబలి తో రాజమౌళి క్రియేట్ చేసిన సునామి తరువాత.. మరలా అంతలా పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజిఎఫ్ మొదటి భాగం సూపర్ హిట్ నమోదు చేసుకోగా రెండో భాగం సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకుంది. సౌత్ సైడ్ మాత్రమే కాదు నార్త్ సైడ్ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయారు ప్రశాంత్. అందుకే ఆయన తదుపరి ప్రాజెక్టుల పైన ఎన్నో ఆశలు నెలకొన్నాయి. ఇక అలాంటి తరుణంలో ఈ డైరెక్టర్ ఏకంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో సినిమా ప్రకటించగా…అంచనాలు ఆకాశాన్ని తాకడం మొదలెట్టాయి.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ చిత్రం గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం పెద్దగా జోరుగా జరగకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తుంది. అయితే ప్రమోషన్స్ జరగకపోయినా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేసిన పృథ్వీరాజ్ అలానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రం కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
   
తాజాగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఈ డైరెక్టర్ తనకు ఒక సమస్య ఉంది అని చెప్పడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

అసలు విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం అలానే తదుపరి కే జి ఎఫ్ రెండు భాగాలు చూసినవారికి ఆయన సినిమాలన్నీ డార్క్ ఫ్రేమ్స్ లోనే ఉంటాయి అన్న విషయం అర్థమైపోతుంది. ఆయన సినిమాల్లో ఎక్కువ కలర్స్ కనపడవు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా బాగా వచ్చాయి. ఇప్పుడు వచ్చే సలార్ కూడా డార్క్ గానే ఉండబోతుంది అని ఈ చిత్ర ట్రైలర్ తెలపకనే తెలిపింది. అయితే దీనికి ఒక కారణం ఉందని తాజా ఉంటర్వ్యూలో చెప్పాడు ప్రశాంత్ నీల్.

ఈ విషయం గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘నాకు OCD (Obsessive compulsive disorder) సమస్య ఉంది. నాకు ఏదైనా ఎక్కువ కలర్స్ ఉంటే అస్సలు నచ్చదు. అందుకే నా సినిమాలు అన్నీ కూడా అలా అంటాయి. నా పర్సనల్ థాట్స్ అక్కడ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అంతే కానీ నా సినిమాలకు ఒకదానికొకటి సంబంధం లేదు’ అని క్లారిటీ ఇచ్చారు. 
అయితే ఈ OCD ఉన్నవాళ్లు కేవలం ప్రతీది క్లీన్ గా ఉండాలి అని అనుకుంటారు అని మనం అనుకుంటే అది కూడా పొరపాతే. ఎందుకంటే ఈ సమస్యతో బాధపడే వారికి కలర్స్ కి సంబంధించి ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయట.

అంతేకాదు ఈ స్టేట్మెంట్ తో.. KGF, సలార్ సినిమాలకు ఎలాంటి కనెక్షన్ లేదు అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమా తెలుగు సినిమాల కనడ సినిమాల అని కూడా కొంతమందికి సందేహాలు ఉండడంతో.. ఈ విషయం గురించి దర్శకుడు స్పందిస్తూ.. ఈ చిత్రాన్ని తెలుగులోనే తీసి మిగిలిన భాషల్లోకి డబ్బింగ్ చేశామని, ఈ సినిమా ఇద్దరు ప్రాణమిత్రులు శత్రువులుగా మారే కథ అని తెలిపాడు.

Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..

Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More