Home> వినోదం
Advertisement

Kalki 2898 AD: సెకండ్ వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర వీర కుమ్ముడు కుమ్మేసిన ప్రభాస్ కల్కి.. ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..


Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. నిన్నటితో సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుంది.

Kalki 2898 AD: సెకండ్ వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర వీర కుమ్ముడు కుమ్మేసిన ప్రభాస్ కల్కి.. ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..

Kalki 2898 AD Collections: ‘కల్కి’ మూవీతో ప్రభాస్ సరికొత్త రికార్డులు బద్దలు కొట్టే దిశగా ప్రయాణిస్తున్నాడు. ఇప్పటికే నార్త అమెరికాలో ఈ సినిమా $15.5 యూఎస్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్ లోనే ఈ సినిమా మన కరెన్సీలో దాదాపు రూ. 120 కోట్ల షేర్ (రూ. 220 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. శనివారం రోజున అనుకున్న దాని కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టిన కల్కి మూవీ.. 11వ రోజు ఆదివారం అన్ని చోట్ల దుమ్ము దులిపింది. తెలగు రాష్ట్రాల్లో ఈ సినిమా జోరు తగ్గినా.. హిందీ బెల్ట్.. ఓవర్సీస్ మార్కెట్ లో ఎక్స్ లెంట్ జోరు చూపిస్తోంది. మొత్తంగా హిందీలో భారత్ మార్కెట్ లో నిన్నటితో ఈ సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను  క్రాస్ చేసింది. అక్కడ దాదాపు రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆదివారం రోజు.. ఆఫ్ లైన్ టికెట్స్ గట్రా అన్ని కలిపితే.. దాదాపు రూ. 6 కోట్ల షేర్ నుంచి రూ. 7 కోట్ల వరకు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు రెస్ట్ ఆఫ్ భారత్ అన్ని కలిపితే.. దాదాపు రూ. 6 కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 24 కోట్ల నుంచి రూ. 25 కోట్ల షేర్ (రూ. 50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి. మరోవైపు ఆఫ్ లైన్ సేల్స్ బాగుంటే మాత్రం ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఓవరాల్ గా 11 రోజుల్లో కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 900 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఇదే జోరు కొనసాగిస్తే.. ఈ వీకెండ్ లోపు రూ. 1000 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా చెప్పొచ్చు.  

కల్కి 2898 ఏడి విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రభాస్.. కర్ణుడిగా.. భైరవగా అలరించారు. అటు అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామ పాత్రలో అలరించారు. ఇక కమల్ హాసన్ కలి పురుషుడి పాత్ర అయిన సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో ఇరగదీసారు. మరోవైపు దీపికా పదుకొణే.. కల్కి తల్లి అయిన సుమతి పాత్రలో నటించడం విశేషం. మొత్తంగా తెలుగు కాదు కాదు.. భారతీయ ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం ముందు ముందు ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందో చూడాలి. 

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More