Home> వినోదం
Advertisement

Adipurush Teaser Records : దటీజ్ ప్రభాస్.. నెగెటివ్ టాక్‌తో రికార్డ్స్ బద్దలు

Prabhas Adipurush Teaser Records in Hindi ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. తాజాగా హిందీ టీజర్ రికార్డులు చూసి అందరూ షాక్ అవుతున్నారు. చివరకు కేజీయఫ్‌  చాప్టర్ 2 పేరిట ఉన్న రికార్డులు బద్దలయ్యాయి.
 
 

Adipurush Teaser Records : దటీజ్ ప్రభాస్.. నెగెటివ్ టాక్‌తో రికార్డ్స్ బద్దలు

Adipurush Teaser Records : ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ గురించి నిన్న మొదలైన చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొందరు అద్భుతంగా ఉందని అంటే.. ఇంకొందరు మాత్రం దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తమిళ ప్రేక్షకులు అయితే కావాలనే ఈ టీజర్‌ను ట్రోల్ చేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమాను తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారనే కోపాన్ని ఆదిపురుష్ మీద చూపిస్తున్నారు. అయితే ఇక్కడి ప్రేక్షకులు సైతం ఆదిపురుష్‌ టీజర్ పట్ల అంతగా ఆనందాన్ని వ్యక్త పర్చడం లేదు. నాసిరకమైన వీఎఫ్‌ఎక్స్ పట్ల పెదవి విరుస్తున్నారు.

అయితే ఆదిపురుష్‌ టీజర్‌లో ప్రభాస్ లుక్ పట్ల ఒరిజినాలిటీ మిస్ అయిందని, అంతా కూడా యానిమేషన్‌లా ఉందని అందరూ అంటున్నారు. ఇలాంటి చిత్రాలు తీయాలన్నా, వీఎఫ్‌ఎక్స్ వాడాలన్నా అది రాజమౌళి వల్లే సాధ్యమని అంటున్నారు. రాముడిగా ప్రభాస్‌ను చూపించిన తీరు మీద ఓం రౌత్‌ను జనాలు తిడుతున్నారు. వానర సైన్యమా? గాడ్జిల్లాలా? అంటూ ట్రోల్స్ వేస్తున్నారు.

ఇలా టీజర్ మీద ఎలాంటి టాక్ వచ్చినా కూడా రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకే కేజీయఫ్ పేరిట ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా బద్దలయ్యాయి. ఆదిపురుష్‌ టీజర్ కేవలం 15 గంటల్లోనే కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టేసింది. హిందీలోనూ ఈ టీజర్ కొంగొత్త రికార్డులను కొల్లగొట్టేసింది. 24 గంటల్లో కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా టీజర్ 68 మిలియన్స్ కొల్లగొడితే.. ఆదిపురుష్ 85 మిలియన్ల వ్యూస్ (ఆర్టికల్ రాసే సమయానికి) కొల్లగొట్టేసింది. 

తెలుగు తొమ్మిది మిలియన్లు, తమిళంలో ఏడు మిలియన్లకుపైగా, కన్నడలో మూడు మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టేసింది. కేవలం హిందీలోనే.. 64 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టేసింది (ఆర్టికల్ రాసే సమయానికి). మొత్తానికి 24 గంటల్లో ఆదిపురుష్ టీజర్ ప్రభంజన సృష్టించేలా ఉంది.  లైక్స్ విషయంలోనూ ఆదిపురుష్ టీజర్ దుమ్ములేపేస్తోంది.

ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ టీజర్‌తో సినిమా మీద మాత్రం కాస్త నెగెటివ్ టాక్ మొదలైంది. మరి ట్రైలర్, మిగతా కంటెంట్ ఎలా ఉంటుందో.. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : శ్రీముఖి తెలివే తెలివి.. అంతా కవర్ చేసి అది మాత్రం చూపించేసిందిగా

Also Read : దసరాకు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్. స్వాతి ముత్యం.. టికెట్ రేట్లు ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More