Home> వినోదం
Advertisement

Pawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తం

OG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న.. ఓజి సినిమా.. విడుదల విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కావాలి.. అయితే చిత్ర బృందం.. ఈ సినిమాని వాయిదా వేయనుంది. రోజులు దగ్గర పడుతున్నాయి.. కానీ చిత్ర బృందం ఇంకా ఈ విషయం గురించి నోరు విప్పకపోవడంతో.. ఫాన్స్ నిర్మాతని ట్రోల్ చేస్తున్నారు. 

Pawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తం

OG Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. చేతిలో.. బోలెడు సినిమాలు ఉన్నాయి. కానీ అందులో ఒక్క సినిమా కూడా.. పూర్తి కావడం లేదు. ఒకవైపు హరిహర వీరమల్లు.. మరోవైపు ఓజీ.. ఈ రెండు సినిమాల షూటింగులు ఎప్పటికీ పూర్తవుతాయో.. పవన్ కళ్యాణ్ కి కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. 

కాగా ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు.. కూడా పరిస్థితి ఇంకోలా ఉంది. అప్పుడు పవన్ త్వరగా షూటింగ్ ముగించాలని చూశారు. ఓజీ సినిమా ఎట్టి పరిస్థితుల్లో.. ఈ ఏడాది విడుదల అయిపోతుంది అని.. ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఆఖరికి చిత్ర నిర్మాత.. డివివి దానయ్య కూడా సినిమా గురించి.. బోలెడు అప్డేట్లు ఇచ్చారు. అసలే పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నిజంగా సినిమాని పూర్తి చేయగలరా.. అని అభిమానులు సైతం షాక్ అయ్యారు. 

సినిమా గురించి అప్డేట్ లు వస్తాయి అన్న ఆశలు కూడా పవన్ కళ్యాణ్.. అభిమానులకి అప్పుడు లేవు. కానీ లేని అశలని కల్పించి.. మరీ డివివి దానయ్య.. సినిమాకి బోలెడంత హైప్ ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు.. సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కట్ చేస్తే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని సాధించారు. 

కానీ నిన్న మొన్నటిదాకా సినిమా గురించి.. బోలెడు కామెంట్లు చేసిన నిర్మాత మాత్రం.. ఇప్పుడు ఉలుకుపలుకు లేకుండా కూర్చున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ.. ఓజీ చిత్ర నిర్మాతని.. ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇందులో పూర్తిగా నిర్మాతదే తప్పు.. అని కూడా చెప్పలేము. చిత్ర నిర్మాత నిజంగానే సినిమాని.. పూర్తి చేయాలని అనుకుని ఉండొచ్చు.. కానీ ఎన్నికలలో ఇంత భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత.. పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఉండొచ్చు. 

జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు బోలెడు బాధ్యతలు వచ్చి పడ్డాయి. అందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా.. సినిమాల నుంచి కొంచెం బ్రేక్ తీసుకోవడం.. మంచిది అని.. నిర్ణయించుకొని ఉండొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయంలో తప్పులేదు.. కానీ బ్రేక్ తీసుకోవాలి అనుకుంటే.. అది ఎంతకాలం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ప్రస్తుతం కేవలం రాజకీయాల పరంగా యాక్టివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్.. మళ్లీ తిరిగి తన సినిమా షూటింగ్లను మొదలు పెట్టడానికి.. ఇంకా ఎంత సమయం తీసుకుంటారో.. పవన్ కళ్యాణ్ మాత్రమే చెప్పగలరు. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమా నిర్మాతలకు మాత్రం.. అభిమానుల నుంచి ఒక రేంజ్ లో బ్యాండ్ పడుతోంది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More