Home> వినోదం
Advertisement

Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై పోలీసు కేసు నమోదు..


Jani Master: లైంగిక వేధింపులపై  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఎక్కడ ఆగడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం తార స్థాయికి చేరింది. ఇంత జరుగుతున్న కొంత మంది బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్  తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డు ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై పోలీసు కేసు నమోదు..

Jani Master: జానీ మాస్టర్ తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జానీ మాస్టర్. రీసెంట్ గా ఈయనకు జాతీయ అవార్డు కూడా వరించింది. తాజాగా ఈయన పై లైంగిక వేధింపుల ఆరోపణలపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు అయింది. కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు కంప్లైంట్ చేసింది.

చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్ లకు వెళ్లినపుడల్లా  ఆ తర్వాత నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు తనపై  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ కొరియోగ్రాఫర్ తన  ఫిర్యాదులో పేర్కొంది.

ఈ మేరకు సదరు మహిళ కొరియోగ్రాఫర్..  రాయదుర్గం పోలీసు స్టేషన్ లో  జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది.  తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతనిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ కు గతంలో నేర చరిత్ర సైతం ఉంది. 2015లో ఓ కళాశాల లో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ స్థానిక  కోర్టు జానీ మాస్టర్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా జానీ మాస్టర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More