Home> వినోదం
Advertisement

Kartik Aaryan Lady Fans: యువ హీరో ఇంటిముందు లేడీ ఫాన్స్ రచ్చ.. ఏక్ మినట్, ఏక్ మినట్ అంటూ!!

మంగళవారం ముంబైలోని కార్తీక్ ఆర్యన్ ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు నిలబడి.. 'కార్తీక్ దయచేసి బయటికి రా.. ప్లీజ్, ప్లీజ్' అంటూ బిగ్గరగా కేకలు వేశారు. 

Kartik Aaryan Lady Fans: యువ హీరో ఇంటిముందు లేడీ ఫాన్స్ రచ్చ.. ఏక్ మినట్, ఏక్ మినట్ అంటూ!!

 Kartik Aaryan Please Come Out: బాలీవుడ్​ యువ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోను కే టిటు కి స్వీటీ, లవ్ ఆజ్ కల్ 2, లూకా చుప్పి, పతి పత్నీ ఔర్ వో లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. కార్తీక్ ఆర్యన్ భారీ స్థాయిలో అభిమానులను కలిగి ఉన్నాడు. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ (Lady Fans) అతడికి మాములుగా ఉండదు. ఇదే మరోసారి నిరూపితమైంది. తాజాగా కార్తీక్ ఆర్యన్​ ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు హల్​చల్​ చేశారు. ఆయనపై ఉన్న వీరాభిమానాన్ని చాటుకున్నారు. 

మంగళవారం (జనవరి 4) ముంబైలోని కార్తీక్ ఆర్యన్ ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు నిలబడి.. 'కార్తీక్ దయచేసి బయటికి రా.. ప్లీజ్, ప్లీజ్' (Kartik Aaryan Please Come Out) అంటూ బిగ్గరగా కేకలు వేశారు. విషయం తెలుసుకున్న యువ హీరో గేటు బయటకి రావడంతో అక్కడి లేడీ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక అమ్మాయి కార్తీక్‌ని చూడగానే నేను మాట్లాడలేకపోతున్నాను అని ఎగిరి గంతులు వేసింది. మరొకరు నా ఫోన్‌ అన్‌లాక్ అవ్వడం లేదే అని అనగానే.. కార్తీక్‌ నవ్వులు పూయించాడు. అనంతరం తన అభిమానులతో కలిసి ఫొటోలు దిగాడు. 

Also Read: Daughters: అంత్యక్రియలకు కుమారులు దూరం.. తల్లి మృతదేహాన్ని 4 కిలోమీటర్లు మోసిన కుమార్తెలు! కారణం ఏంటంటే?

అక్కడే ఉన్న మరికొంత మంది అమ్మాయిలు (Fans) కార్తీక్ ఆర్యన్‌తో ఫొటోలు దిగి సంబరపడ్డారు. ఫొటోల అనంతరం కార్తీక్ ఇంటిలోపలికి వెళ్ళెందుకు ప్రయత్నించగా.. ఏక్ మినట్, ఏక్ మినట్ అంటూ ఫాన్స్ అరిచారు. ఇంకాసేపు ఉండండి అంటూ బ్రతిమిలాడారు. మీ ప్రేమకు కృతజ్ఞతలు అని చెప్పి కార్తీక్ ఆర్యన్‌ లోపలికి వెళ్లిపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Also Read: BAN vs NZ: న్యూజిలాండ్‌ గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం.. డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చచేసిన ప్లేయర్స్ (వీడియో)!!

 
 
 
 
 

కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం 'షాహ్​జాదా' (Shehzada) సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'అల వైకుంఠపురములో' సినిమాకు ఇది రీమేక్​. ఈ సినిమా ఢిల్లీ షెడ్యూల్‌ను ఇటీవలే పూర్తి చేశాడు. వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ (Rohit Dhawan) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కృతి సనన్ (Kriti Sanon) హీరోయిన్‌గా  నటిస్తోంది. కార్తీక్ నటించిన 'ధమాకా' చిత్రం ఇటీవలే నెట్​ఫ్లిక్స్​లో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. 'ఫ్రెడ్డీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తీక్ 'భూల్ భూలయ్యా 2' కూడా నటిస్తున్నాడు. ఇందులో టబు మరియు కియారా అద్వానీ కీలక పత్రాలు చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

  

Read More