Home> వినోదం
Advertisement

Peka Medalu : 50 రూపాయలకే థియేటర్లో సినిమా.. అది కూడా రిలీజ్ కాకముందే!

Peka Medalu Review: ప్రస్తుతం టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో కేవలం 50 రూపాయలకే మీరు సినిమా చూడొచ్చని తెలుసా? అవును కొత్తగా విడుదలయ్యే పేకమేడలు సినిమా మేకర్స్.. తెలుగు ప్రేక్షకులకు ఈ అద్భుత అవకాశాన్ని అందిస్తున్నారు. మరి దీనికోసం మీరు చేయాల్సిందేమిటో ఒకసారి చూద్దాం..

Peka Medalu : 50 రూపాయలకే థియేటర్లో సినిమా.. అది కూడా రిలీజ్ కాకముందే!

Peka Medalu Premiere Show Offer: ఈ మధ్య విడుదలైన కల్కి సినిమా టికెట్ ధరలు.. ఆకాశాన్ని తాకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు విడుదల కాబోతున్న ఒక సినిమా.. కేవలం ప్రేక్షకుల ముందుకి 50 రూపాయల టికెట్ తో రాబోతోంది. అవును మీరు విన్నది నిజమే. మరో విశేషమేమిటి అంటే.. ఈ సినిమాని 50 రూపాయలకి విడుదల ముందే చూసేయొచ్చు. మరి అది ఎలాగో ఒకసారి చూద్దాం..

తెలుగులో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన వినోద్ కిషన్.. త్వరలోనే మన ముందుకి పేకమేడలు సినిమాతో హీరోగా రాబోతున్నాడు.  ఇప్పటికే విరుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నటుడు రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో .. ఈ చిత్రం తెరకెక్కింది. వినోద్ కిషన్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో అనూష కృష్ణ, జగన్ యోగి రాజ్, అనూష నూతల, రితిక శ్రీనివాస్, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.

పనిపాట లేకుండా జీవితంలో ఏమి సాధించకుండా.. భార్య సంపాదన మీద బతుకుతూ.. డబ్బులతో జల్సా చేసుకొనే.. ఓ వ్యక్తి జాబ్ లో జాయిన్ అవుతారు. కాగా అక్కడ ఒక అమ్మాయి పరిచయమయితే.. ఆ అమ్మాయిని బుట్టలో వేయడానికి అతను చేసే ప్రయత్నాలు.. ఆ తరువాత తన లైఫ్ ఎలా మారింది? భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకొచ్చాయి అనే ఆసక్తికర విషయాలతో ఈ సినిమా కథ సాగబోతోంది అని ఈ చిత్ర ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 

 

కాగా కామెడీ తో పాటు ఎమోషనల్ గా సాగే ఈ సినిమాకు ప్రమోషన్స్ కొత్తగా ప్లాన్ చేశారు సినిమా యూనిట్. ఈ సినిమా జులై 19న రిలీజ్ కాబోతుంది. అయితే ఇటీవల కొన్ని సినిమాలు.. రిలీజ్ కి ముందే సినీ ప్రేక్షకుల కోసం..పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా టికెట్స్ 200 నుంచి 500 ఉన్న ప్రస్తుత సమయంలో.. పేకమేడలు సినిమా పెయిడ్ ప్రీమియర్ ని కేవలం 50 రూపాయలకే అందిస్తున్నారు. ఈరోజు, రేపు,, ఎల్లుండి.. సినిమా రిలీజ్ ముందు రోజు వరకు వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లాంటి సిటీల్లో పలు చోట్ల ప్రీమియర్ షోలు వేస్తున్నారు ఈ చిత్ర మేకర్స్.

కాబట్టి ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ కి ముందే 50 రూపాయలకే పేకమేడలు సినిమా చూసేయండి. మీ సిటీలో ఈ చిత్రం ప్రీమియర్స్ ఎక్కడ వేస్తున్నారో కనుక్కొని.. ఎంచక్కా తక్కువ ధరకి.. సినిమాని ఎంజాయ్ చేసేయండి.

Also read: TG DSC and Groups issue: సచివాలయం దగ్గర హైటెన్షన్... నిరసనకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు.. వీడియో ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More