Home> వినోదం
Advertisement

Rakshana - Payal Rajput: ఆసక్తిరేకిస్తోన్న పాయ‌ల్ రాజ్‌పుత్ ‘రక్షణ’ టీజర్.. త్వరలో థియేటర్స్‌లో సందడి చేయనున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌..

Rakshana - Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు హాట్ బోల్డ్ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకుల్లో పాపులర్ అయిన పాయల్ రాజ్‌పుత్ ఇపుడు 'రక్షణ' మూవీతో పలకరించబోతుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ విడుదల కాబోతుంది.  

Rakshana - Payal Rajput: ఆసక్తిరేకిస్తోన్న పాయ‌ల్ రాజ్‌పుత్ ‘రక్షణ’ టీజర్.. త్వరలో థియేటర్స్‌లో సందడి చేయనున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌..

Rakshana - Payal Rajput:  పాయల్ రాజ్‌పుత్ ఎపుడో నటించిన మూవీ 'రక్షణ' ఈ సినిమాలో తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. తాజాగా విడుదలైన టీజర్ విషయానికొస్తే..  'వాడెవ‌డో తెలియ‌దు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. .
ఇప్ప‌టి వ‌ర‌కు నేను క‌చ్చితంగా వాడిని క‌ల‌వ‌లేదు.. ఏరోజు నేను వాడ్ని క‌లుస్తానో అదే ఆఖ‌రి రోజు' అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే సీన్‌తో  పాయ‌ల్ రాజ్‌పుత్‌ను టెర్రిఫిక్‌గా ఉంది. ఇంత‌కీ ఈమె అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవ‌రికీ? ఎందుకోసం.. ఎవ‌రినీ ఆమె వెతుకుతుంది? అనే వివ‌రాలు తెలియాలంటే మాత్రం ‘రక్షణ’ సినిమా చూడాల్సిందే.

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకుంది పాయల్ రాజ్‌పుత్, ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన క్యారెక్టర్స్‌కు డిఫరెంట్‌గా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో పాయల్  న‌టించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజ‌ర్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. ఓ సీరియల్ కిల్లర్ వరుసగా హ‌త్య‌లు చేస్తుంటాడు.. అత‌నెవ‌రో క‌నిపెట్టి అరెస్ట్ చేయాల‌ని పోలీస్ ఆఫీస‌ర్‌గా పాత్రలో పాయ‌ల్ రాజ్‌పుత్ నటించింది. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ర‌క్ష‌ణ చిత్రం టీజర్ చూస్తే తెలుస్తోంది.

హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ..'రక్షణ' టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. పాయల్ నటించిన తొలి  క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుందో టీజర్ చూస్తే తెలుస్తోంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన  ఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందించినట్టు  మేకర్స్ తెలిపారు. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించినట్టు చిత్ర నిర్మాత తెలిపారు.ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను విడుదల తేదిని ప్రకటించనున్నారు.

న‌టీన‌టులు:

పాయ‌ల్ రాజ్‌పుత్‌, రోష‌న్‌, మాన‌స్‌, రాజీవ్ క‌న‌కాల‌, వినోద్ బాల‌, శివ‌న్నారాయ‌ణ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

దర్శకుడు: ప్రణదీప్ ఠాకోర్, నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్ , నిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్, ఛాయాగ్రహణం: అనిల్ బండారి, సంగీతం: మహతి సాగర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ జోసెఫ్, రమేష్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శరద్ వాఘ్రే, ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ కమ్మెల, కాస్ట్యూమ్స్: శ్రీను కనుమోలు, మేకప్: కోటి లకావత్. సౌండ్ డిజైనర్: జె.ఆర్. ఎతిరాజ్, ఎడిటర్: గ్యారి బి హెచ్, స్టంట్స్: వెంకట్ మాస్టర్, ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్, రైటర్: తయనిధి శివకుమార్, స్టిల్స్:ఎ. దాస్, పబ్లిసిటీ డిజైనర్: రమాకాంత్, వీఎఫ్ఎక్స్: అలగర్‌సామి, ,మయాన్- ప్రదీప్ పుడి, కోడైరెక్టర్: రాఘవేంద్ర శ్రీనివాస, పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్రకుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

Also Read: PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More