Home> వినోదం
Advertisement

Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

Payal Rajput Mangalavaram పాయల్ రాజ్‌పుత్ అజయ్ భూపతి కలిసి చేస్తోన్న రెండో సినిమా మంగళవారం. ఇది వరకు ఈ సినిమాను రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌ అంతగా చర్చకు దారి తీయలేదు. కానీ తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

Payal Rajput Mangalavaram ఆర్ఎక్స్ 100 సినిమాతో అటు అజయ్ భూపతి, ఇటు పాయల్ రాజ్‌పుత్ హాట్ టాపిక్ అయ్యారు. మొదటి సారిగా హీరోయిన్‌ను విలన్‌గా చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అజయ్ భూపతి. పాత్ బ్రేకింగ్ సినిమాగా నిలిచేలా చేసిన అజయ్ భూపతి టేకింగ్, మేకింగ్‌కు అంతా ఫిదా అయ్యారు. ఇక ఇందు పాత్రలో పాయల్ కనిపించిన, నటించిన తీరుకు టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఓవర్ నైట్‌లో పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో క్రేజ్ పెరిగింది.

ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ కలిసి మంగళవారం అనే సినిమాను చేస్తున్నారు. ఇంత వరకు ఇది ఎక్కువగా హాట్ టాపిక్ కాలేదు. కానీ ఇప్పుడు పాయల్ నగ్నంగా కనిపించే పోస్టర్‌ను రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశాడు అజయ్ భూపతి. అయితే ఈ సారి ఆర్ఎక్స్ 100ను మించి ఉండేలా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ సారి పాయల్ రెండు తెలుగు రాష్ట్రాలను తగలబెట్టేలానే ఉంది.

 

పాయల్ రాజ్‌పుత్‌కు ఇంత వరకు మళ్లీ ఓ సరైన హిట్ పడలేదు. ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా హిట్లు అయితే రాలేదు. మరో వైపు అజయ్ భూపతి సైతం మహా సముద్రంతో డల్ అయ్యాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన మహా సముద్రం సినిమా బోల్తా కొట్టేసింది. దీంతో అజయ్‌ భూపతికి మళ్లీ హీరోలెవ్వరూ చాన్స్ ఇవ్వలేదు. దీంతో పాయల్‌ను ప్రధాన పాత్రగా పెట్టి ఈ మంగళవారం అనే సినిమాను స్టార్ట్ చేశారు.

Also Read:  Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు అఖిల్ అక్కినేని వేధింపులు?.. చిర్రెత్తుకొచ్చి కేసు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ

మంగళవారం సినిమా ఈ ఇద్దరికీ చాలా అవసరం. ఈ సినిమా హిట్ అయితేనే తదుపరి సినిమాలు వస్తాయి. అసలే పాయల్ రాజ్‌పుత్‌కు వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి. ఆమె చివరగా నటించిన మంచు విష్ణు జిన్నా సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా వర్కౌట్ కాలేదు. మరి ఈ నగ్న పోస్టర్‌తో పాయల్‌ టాప్ లేపేసేలానే ఉంది. అజయ్ భూపతి ఈ సారి అంతకు మించి అనేలా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించడం విశేషంగా నిలిచింది.

Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More