Home> వినోదం
Advertisement

BRO collection Day 1: పవర్ స్టార్ మేనియా.. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన 'బ్రో' మూవీ..

BRO box office collections: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ చేసిన 'బ్రో' మూవీకి మిక్సడ్ టాక్ వచ్చినప్పుటికీ తొలి రోజు భారీగానే ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఫస్ట్ డే ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..
 

BRO collection Day 1: పవర్ స్టార్ మేనియా.. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన 'బ్రో' మూవీ..

BRO Movie box office collection Day 1: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో'(BRO Movie) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. అంచనాలకు మించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి రోజు ఈ సినిమా రూ. 30 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మెుదటి రోజు తెలుగు బెల్ట్‌లో  బ్రో సినిమా 76.77% ఆక్యుపెన్సీని కలిగి ఉంది. పవన్ మేనియాతో ఈ సినిమా మెుదటి రోజు భారీగానే వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ మూవీ 14 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. 

త‌మిళ్ లో సక్సెస్ అయిన 'వినోద‌య సిత్తం' అనే సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కునుంది. ఇందులో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌, కేతికా శ‌ర్మ హీరోయిన్లుగా నటించారు. స్పెష‌ల్ సాంగ్‌లో ఊర్వ‌శి రౌటేలా న‌టించింది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్(Trivkram) స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. పవన్ మేనియా ఇదే విధంగా కొనసాగితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజన సృష్టించే అవకాశం ఉంది. తాజాగా ఈ సినిమాలోని డైలాగ్స్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ ను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇందులో త్రివిక్రమ్ ప్రాస పేరుతో రాసిన ఓ డైలాగ్ పరమ చెత్తగా ఉందని అంటున్నారు.

Also Read: Rajinikanth- Nani: రజినీకాంత్ సినిమాలో నాని.. కథను మలుపు తిప్పే పాత్రలో నేచురల్ స్టార్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More