Home> వినోదం
Advertisement

Bheemla Nayak Twitter Review: ఏమన్నా ఉందా .. 'గబ్బర్‌ సింగ్' రేంజ్‌ సినిమా ఇది! పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌!!

Pawan Kalyan Bheemla Nayak Twitter Review: భారత్‌లో కూడా 'భీమ్లా నాయక్‌' స్పెషల్ షోలు నడుస్తున్నాయి. ప్రీమియర్, స్పెషల్ షోలను చూసిన పవన్‌ కల్యాణ్ ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Bheemla Nayak Twitter Review: ఏమన్నా ఉందా .. 'గబ్బర్‌ సింగ్' రేంజ్‌ సినిమా ఇది! పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌!!

Pawan Kalyan Bheemla Nayak Twitter Review: 'వకీల్‌సాబ్' లాంటి బంపర్ హిట్ తర్వాత 'పవర్ స్టార్' పవన్‌ కల్యాణ్ తాజాగా నటించిన చిత్రం 'భీమ్లా నాయక్‌'. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం పవన్ ఫాన్స్ ఇప్ప్పటినుంచో ఎదురుచూస్తునారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన భీమ్లా నాయక్‌.. ఎట్టకేలకు ఈరోజు (ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వచింది. ఇప్పటికే యూకే, అమెరికాతో పాటు పలు దేశాల్లో ఈ సినిమా ప్రీమియర్‌ షోలు నడుస్తున్నాయి. 

భారత్‌లో కూడా 'భీమ్లా నాయక్‌' స్పెషల్ షోలు నడుస్తున్నాయి. ప్రీమియర్, స్పెషల్ షోలను చూసిన పవన్‌ కల్యాణ్ ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. థియేటర్లో, బయట తెగ సందడి చేస్తున్నారు. ఫాన్స్ అందరూ తమతమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. గబ్బర్‌ సింగ్ రేంజ్‌ సినిమా ఇది, పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అంటూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. దాంతో సోషల్ మీడియా మొత్తం పవన్ మేనియాతో ఊగిపోతోంది. ఫాన్స్ ట్వీట్లు చూస్తే.. పవర్ స్టార్ ఖాతాలో మరో హిట్ చేరినట్టే అనిపిస్తోంది. 

'భీమ్లా నాయక్‌ మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా సాగినా.. రెండోభాగం మాత్రం దుమ్ములేపింది. ఒళ్లు గగురు పొడిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు. 3.25 రేటింగ్‌ ఇస్తా' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'ఏమన్నా ఉందా సినిమా. గబ్బర్‌ సింగ్ రేంజ్‌ సినిమా. పవన్‌ కళ్యాణ్‌ అద్భుతంగా నటించాడు. థమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ వేరే లెవల్‌ అబ్బ' అని యూకేకి చెందిన మరో అభిమాని ట్వీట్ చేశారు. 

'షో ఇప్పుడే పూర్తయింది. సూపర్ సినిమా. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ఇది. థమన్‌ మ్యూజిక్‌కు పవన్‌ నట విశ్వరూపం తోడైంది. రెండో భాగంలో ఎవరూ కుర్చీల్లో కూర్చోరు. త్రివిక్రమ్ మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాడు. రానా (డానియల్ శేఖర్) బాగా నటించాడు' అని అమెరికాకు చెందిన ఓ అభిమాని ట్వీట్ చేశాడు. బిగ్గెస్ట్‌ హిట్‌, బ్లాక్ బస్టర్ కా బాప్, సూపర్ సినిమా అంటూ ఫాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. 

Also Read: Ukraine vs Russia: హింసను తక్షణమే ఆపండి.. పుతిన్‌ను కోరిన ప్రధాని మోదీ!!

Also Read: Ukraine vs Russia: ఉక్రెయిన్‌లో తెరకెక్కిన తెలుగు సినిమాలు ఇవే.. మొదటి సినిమా ఏదంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More