Home> వినోదం
Advertisement

Bheemla Nayak Trailer Talk: ఆ ఒక్కటి ఫ్యాన్స్‌ను బాగా డిసప్పాయింట్ చేసిందా? ఆర్జీవీ రియాక్షన్ ఇలా..

Pawan Kalyan Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ట్రైలర్‌పై ఫ్యాన్స్, నెటిజన్స్ రియాక్షన్స్ ఎలా ఉందంటే... 

Bheemla Nayak Trailer Talk: ఆ ఒక్కటి ఫ్యాన్స్‌ను బాగా డిసప్పాయింట్ చేసిందా? ఆర్జీవీ రియాక్షన్ ఇలా..

Pawan Kalyan Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ట్రైలర్‌ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ట్రైలర్ విడుదల కాస్త లేటైనా ఫుల్ మీల్స్ పెట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ట్రైలర్ నిరాశపరిచిందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్‌ని ఇంత పూర్‌గా ఎలివేట్ చేస్తారా.. ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసిందంటూ సోషల్ మీడియాలో పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) ఫ్యాన్స్‌ని ఎక్కువగా నిరాశపరిచినట్లు కనిపిస్తోంది. ట్విట్టర్‌లో చాలామంది ఫ్యాన్స్ బీజీఎం బాగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. బీజీఎం అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. అసలు తమన్ మార్క్ కనిపించలేదని... బీజీఎం చాలా స్లోగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బీజీఎం చాలా ఫ్లాట్‌గా ఉందని.. ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్స్ చేశారు. మరికొందరు సినిమా మేకర్స్‌పై విరుచుకుపడ్డారు. ట్రైలర్ వాయిదా వేయడంపై ఉన్న శ్రద్ధ బీజీఎంపై పెట్టి ఉంటే బాగుండేదని కామెంట్స్ చేశారు.

ట్రైలర్ కట్ బాగోలేదని.. దీనికన్నా ఫ్యాన్స్ ఎడిటింగ్ బాగుటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేయడం గమనార్హం.ఇక భీమ్లా నాయక్ ట్రైలర్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ట్రైలర్ చూశాక.. భీమ్లా నాయక్ టైటిల్ కంటే డానియెల్ శేఖర్ అనే టైటిల్ పెట్టి ఉండాల్సిందని కామెంట్ చేశాడు. ఆర్జీవీ ట్వీట్‌పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

మరోవైపు భీమ్లా నాయక్ ట్రైలర్ కేవలం 7 నిమిషాల్లోనే 200K లైక్స్‌తో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మొత్తంగా టాక్‌తో సంబంధం లేకుండా ఎప్పటిలాగే పవన్ ట్రైలర్ యూట్యూబ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

Also Read: Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్ ట్రైలర్.. పవర్ ప్యాక్డ్... ఫ్యాన్స్‌కు పూనకాలే..

Bheemla Nayak: ట్రైలర్ గంట ఆలస్యం... భీమ్లా నాయక్ టీమ్ ను ఏకిపారేసిన ఫ్యాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More