Home> వినోదం
Advertisement

Bheemla Nayak Teaser: పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్?

Bheemla Nayak Teaser: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ను మొదలుపెట్టేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సినిమా టీజర్ ను డిసెంబరు 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

Bheemla Nayak Teaser: పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్?

Bheemla Nayak Teaser: 'భీమ్లా నాయక్' సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. గ్లింప్స్ లోని డైలాగు, పవన్ కల్యాణ్ గెటప్ ఫ్యాన్స్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, లాలా భీమ్లా సాంగ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తమన్ మ్యాజిక్ తో సినిమాకు మరింతగా ప్రచారం లభించింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను శరవేగంగా మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. సినిమా టీజర్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.  

ఈ టీజర్ ను డిసెంబరు 14న విడుదల చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న తొలి మల్టీస్టారర్ చిత్రమిది. ఇందులో నిత్యా మేనన్, సంయుక్త మేనన్ కథానాయికలు. వీరితో పాటు సముద్రఖని, మురళీ శర్మ, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్, పమ్మి సాయి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.      

Also Read: Akhanda pre-release: బాలయ్య ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​- అఖండ ప్రీ రిలీజ్​కు స్పెషల్​ గెస్ట్ ఎవరంటే..

Also Read: chiranjeevi: మరోసారి పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి...శివశంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More