Home> వినోదం
Advertisement

Pawan Kalyan-Rana: లాంఛనంగా ప్రారంభమైన పవన్, రానా రీమేక్ చిత్రం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. 

Pawan Kalyan-Rana: లాంఛనంగా ప్రారంభమైన పవన్, రానా రీమేక్ చిత్రం

Pawan Kalyan - Rana multi-starrer launched: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. మలయాళ చిత్రం ‘అయ్యపనమ్ కోషియం’ ( Ayyapanum Koshiyum ) రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రానా నటించనున్నట్లు సోమవారం పేర్కొన్న మూవీ మేకర్స్.. ఆ తర్వాత వెంటనే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా పట్టాలెక్కించారు. 

ఈ సందర్భంగా ఈ చిత్రానికి మొదటగా ప‌వ‌న్ క‌ల్యాణ్ (pawan kalyan) క్లాప్ కొట్ట‌గా, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్విచాన్ చేశారు. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు సమాచారం. అయితే మలయాళ చిత్రం అయ్యపనమ్ కోషియంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా (Rana Daggubati) క‌నిపించ‌నున్నాడు. Also read: Pawan Kalyan-Rana: అదిరిపోయే కాంబినేషన్.. పవన్ మూవీలో రానా

సాగర్‌ కె.చంద్ర (Sagar Chandra) దర్శకత్వంలో తెరకెక్కనున్న ( Ayyapanum Koshiyum )  ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (sitara entertainments) ప్రొడక్షన్ నెంబర్. 12 బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్లు, అదేవిధంగా తారగణంపై అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. Also read: KGF Chapter 2: కేజీఎఫ్ 2 బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది

Also read: Sonu Sood: రియల్ హీరోకు గుడి కట్టిన తెలంగాణ ప్రజలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More