Home> వినోదం
Advertisement

OG: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం కోలీవుడ్ స్టార్ హీరో.. ఇంతకీ ఎవరంటే..?

Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా నటిస్తున్న చిత్రం ఓజి. ఈ సినిమా వచ్చే యేడాది మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక పాట పాడడానికి కోలీవుడ్ స్టార్ హీరోని చిత్ర బృందం సంప్రదించగా,  ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. 

OG: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం కోలీవుడ్ స్టార్ హీరో.. ఇంతకీ ఎవరంటే..?

Pawan Kalyan OG Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే సినిమాలలో ఓజీ చిత్రం కూడా ఒకటి.. ఈ సినిమా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ సుజిత్. ఇప్పటికే ఓజి చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ఫ్యాన్స్ కి సైతం.. విపరీతంగా నచ్చింది. దీంతో అభిమానులు ఈ చిత్రం కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం ఓజి సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్  కేవలం ఏడు రోజులు డేట్స్ ఇస్తే చాలు.. ఈ సినిమాని పూర్తిచేసేలా డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కూడా మిగతా చిత్రాల కంటే ముందే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారట.  ఈ నేపథ్యంలోనే ఓజి సినిమా గురించి…ఒక ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారుతోంది. ఈ విషయం విన్న అభిమానులకు పూనకాలు తెప్పించేలా కనిపిస్తోంది. 

అదేమిటంటే ఈ చిత్రంలోని ఒక సాంగ్ కోసం తమిళంలో స్టార్ హీరోగా పేరు పొందిన హీరో శింబును.. చిత్ర బృందం సంప్రదించిందట. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అనగానే శింబు కూడా పాట పాడడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ విషయం అటు కోలీవుడ్ మీడియా కోడై కోస్తోంది. 

సెప్టెంబర్ 27వ తేదీన ఓజీ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉండగా..ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉండడంతో విడుదల తేదీని వాయిదా వేశారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక అదిరిపోయే పోస్టర్ తో  తెలియజేశారు. 

ఇక ఓజి సినిమా పోస్ట్ పోన్..అవ్వడంతో ఈ  సినిమా ప్లేస్ లో దేవర సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మరి అభిమానులైతే ఓజి సినిమా కోసం కచ్చితంగా మరి కొన్ని మాసాలు ఎదురుచూడాల్సిందే.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే ఒకవైపు తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మరొకవైపు తాను నటించాల్సిన సినిమా షూటింగ్లలో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

Also Read: Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌

Also Read: Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More