Home> వినోదం
Advertisement

Pawan Kalyan OG : దారినపోయే దానయ్యవి కాదు.. దేవుడివి దానయ్య.. దండం పెట్టేస్తోన్న పవర్ స్టార్ ఫ్యాన్స్

Pawan Kalyan OG : దారినపోయే దానయ్యవి కాదు.. దేవుడివి దానయ్య.. దండం పెట్టేస్తోన్న పవర్ స్టార్ ఫ్యాన్స్

DVV Entertainment OG updates పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఖుషీ అవుతన్నారు. అయితే ఇతర హీరోల అభిమానులు వారిని చూసి కుళ్లుకునే స్థాయికి వచ్చేశారు. ఏదైనా సినిమా షూటింగ్ దశలో ఉంటే.. ప్రొడక్షన్ కంపెనీలు సరిగ్గా ప్రమోట్ చేయవు. అసలు కొన్ని నిర్మాణ సంస్థలకు ఎలా ప్రమోషన్ చేయాలో కూడా తెలియవు. ఇంకొన్ని సంస్థలు అయితే చెప్పిన టైం అప్డేట్లు ఇవ్వకుండా అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటాయి.

కానీ డీవీవీ బ్యానర్ మాత్రం అభిమానులను ఎలా అలరించాలో బాగానే తెలుసుకుంది. అభిమానులకు ఎలాంటి అప్డేట్లు ఇస్తే ఖుషీ అవుతారో తెలుసుకుంది. అఫీషియల్ టైటిల్, ఫస్ట్ లుక్, పోస్టర్లు రిలీజ్ చేస్తేనే అభిమానులు సంతోషిస్తారు అని కాదు. తమ హీరోకు సంబంధించిన సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది.. ఎలా జరుగుతోంది.. లొకేషన్‌లో హీరోల ఫోటోలు, వర్కింగ్ స్టిల్స్ వంటి వాటితోనూ అభిమానులను అలరించవచ్చని డీవీవీ తెలుసుకుంది.

దీంతో పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్‌ను డీవీవీ ట్విట్టర్‌లో షేర్ చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్‌ లొకేషన్‌లో ఎంత సింపుల్‌గా ఎంత స్టైలీష్‌గా ఉన్నాడో చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక పవర్ స్టార్ అభిమానులతో డీవీవీ ట్విట్టర్ హ్యాండిల్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతోంది. మొన్నామధ్య ఓ అభిమాని బిర్యానీ అడిగితే పంపించిన సంగతి తెలిసిందే.

Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

ఇక ఇప్పటికే ఈ మూవీ ముంబై, పుణె పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను జరుపుకుంది. సుజిత్ మంచి స్పీడులో ఉన్నట్టుగా కనిపిస్తోంది. పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌తో బరిలోకి దిగినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్‌ కూడా ఈ సినిమాకు వరుసగా డేట్లు కేటాయించినట్టు కనిపిస్తోంది. అందుకే వెంటవెంటనే కొత్త షెడ్యూల్స్‌ను మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

 

ఈ సినిమాలో ప్రియాంక మోహనన్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌ రొమాన్స్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయమని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, డీవీవీ దానయ్య మాత్రం అభిమానులు ఫేవరేట్ అయ్యారు. దారినపోయే దానయ్యవి కాదు.. దేవుడివి దానయ్య అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More