Home> వినోదం
Advertisement

Kushi Re Release : ఖుషి సినిమా కలెక్షన్స్.. కోట్లకు కోట్లు కొల్లగొట్టేస్తోందిగా

Kushi Re Release Movie Collection పవన్ కళ్యాణ్‌ మూవీకి ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. అందులోనూ ఖుషి లాంటి కూల్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాను రీ రిలీజ్ చేయడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

Kushi Re Release : ఖుషి సినిమా కలెక్షన్స్.. కోట్లకు కోట్లు కొల్లగొట్టేస్తోందిగా

Kushi Re Release Movie Collection పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఇప్పుడు థియేటర్లో దుమ్ములేపేస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా ఒక్క రోజు కోసం ఈ షోను ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూసిన నిర్మాతలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఖుషి సినిమా కోసం ఇప్పటి యూత్ ఇరగబడి చూసేస్తున్నారు. ఖుషి సినిమాను చూస్తూ పాత రోజుల్లోకి వెళ్లిపోతోన్నారంతా. అయితే ఇప్పుడు ఖుషి సినిమా కోసం జనాలు రావడం, వాటికి వస్తున్న కలెక్షన్లను చూసి ట్రేడ్ పండితులు సైతం అవాక్కవుతున్నారు.

ఖుషి సినిమాతో అన్ని రికార్డులు బద్దలవుతున్నాయి. పోకిరిని మళ్లీ రిలీజ్ చేశారు. జల్సా సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు. అయితే వాటికి ఓ మోస్తరుగా కలెక్షన్లు వచ్చాయి. పోకిరికి కోటిన్నరకు పైగా అలా కలెక్షన్లు వస్తే.. జల్సాకు మూడు కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఖుషి సినిమా మొదటి రోజే నాలుగున్నర కోట్లకు పైగా వచ్చినట్టు సమాచారం అందుతోంది.

మొత్తంగా ఈ మూడు రోజుల్లో ఖుషి సినిమాకు దాదాపు ఆరున్నర కోట్లకు పైగా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ చూస్తే ట్రేడ్ వర్గాలు విస్తుపోతోన్నాయి. ఇప్పుడు థియేటర్లో ఆడుతున్న కొత్త సినిమాలకు కూడా ఇలాంటి కలెక్షన్లు రావడం లేదు, జనాలు లేక వెలవెలలాడుతున్న థియేటర్లు సైతం ఖుషి సినిమాతో కళకళలాడుతున్నాయి.

ఖుషి సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం, పాటలు ఇలా ప్రతీ ఒక్కటి హైలెట్‌గా నిలిచాయి. ఇక పవన్ కళ్యాణ్‌ నటన, లుక్స్, భూమిక అందాలు, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా క్లాసిక్‌గా నిలిచాయి.

Also Read: Rakul Preet Pics : రకుల్ బీచ్ ఫోటోలు.. న్యూ ఇయర్ హ్యాంగవుట్‌.. పిక్స్ వైరల్

Also Read: Sreeja Konidela : ఆ వ్యక్తిని కనుగొన్నా.. కొత్త జీవితానికి ఆరంభం ఇదే.. శ్రీజ కొణిదెల పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More